Advertisementt

తమిళ హీరోకి తగిలిన లాఠీ దెబ్బలు

Sat 12th Feb 2022 10:34 AM
vishal,injured,action sequence,laththi shooting,laththi movie  తమిళ హీరోకి తగిలిన లాఠీ దెబ్బలు
Vishal Suffered Accident in Laththi Shooting తమిళ హీరోకి తగిలిన లాఠీ దెబ్బలు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో విశాల్ కి షూటింగ్ లో గాయాలు తగలడం పరిపాటిగా మారింది. గత ఏడాది హైదరాబాద్ లో సామాన్యుడు సినిమా షూటింగ్ సమయంలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణలో విశాల్ వెన్నుముక కి గాయమైంది. ఆ దెబ్బ పెద్దగా తగలేకపోవడంతో విశాల్ సేఫ్ గా ఉన్నారు. గాయాలు తగిలిన కొద్దిరోజుల్లోనే షూటింగ్ కి జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు విశాల్ లాఠీ షూటింగ్ లో మరోసారి గాయాల పాలయ్యాడు. లాఠీ సినిమా యాక్షన్ సన్నివేశంలో పోలీస్ డ్రెస్ లో ఉన్న విశాల్ ఓ బాలుడిని రక్షించే సీన్ లో గాయమైనట్లుగా తెలుస్తుంది.

ఆ ప్రాసెస్ లో విశాల్ చేతి ఎముక విరిగినట్లుగా తెలుస్తుంది. ఏ వినోద్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న లాఠీ షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో గాయమైనట్టుగా, చికిత్స కోసం అలాగే కొన్ని రోజుల పాటు విశ్రాంతి కోసం కేరళ వెళుతున్నట్టుగా విశాల్ ట్వీట్ చేసారు. అయితే విశాల్ పదే పదే గాయాలు పాలవడంతో ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అసలు లాఠీ పట్టి డ్యూటీ చేస్తోన్న పోలీస్ కే దెబ్బలు తగలడం ఏంటి.. ప్చ్ విశాల్ బాడ్ లక్ అంతే..!

Vishal Suffered Accident in Laththi Shooting:

Vishal gets injured while shooting an action sequence

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ