సిద్దు జొన్నలగడ్డ - నేహా శెట్టి కలయికలో డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన డిజె టిల్లు విడుదల అయిన అన్ని కేంద్రాలలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. ఈ సందర్భంగా టీజె టిల్లు టీం సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంది.. ఈ సెలెబ్రేషన్స్ లో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ..
నేను ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము థియేటర్ లో 10శాతం వర్కవుట్ అవుతుంది అని అనుకున్న సీన్స్ అంతకు ఎన్నో రెట్లు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. తమన్ గారి నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. నేను ఇక్కడి వాడినే అందుకే ఆ బాడీ లాంగ్వేజ్, మాటతీరు అన్నీ సహజంగా వచ్చాయి. స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి సులువుగా డిజె టిల్లులా మాట్లాడగలిగా. ఇందాకే త్రివిక్రమ్ గారిని కలిసి వచ్చాం. ఆయన స్క్రిప్టు చూసి ఎక్కడ ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పారో ఇవాళ థియేటర్ లో అదే రిపీట్ అవుతోంది. ఇది ఆయనకు సినిమా మీదున్న అవగాహనకు నిదర్శనం. ఆయన పరిచయం మా అదృష్టం. నిర్మాతకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు.. అన్నారు