తెలుగు సినిమాల్లో అవకాశాలు కరువైనా.. నిత్యం వార్తల్లో నిలిచే నటి రకుల్ ప్రీత్. ఏ జిమ్ వీడియో తోనో, లేదంటే యోగా పిక్స్ తోనో, లేదు అంటే గ్లామర్ ఫొటోస్ తో ఇలా సోషల్ మీడియా లో అభిమానులకి చేరువలో ఉంటుంది. గత రెండేళ్లుగా డ్రగ్స్ కేసు విషయంలో ఈడీ విచారణ ఎదుర్కుంటున్న రకుల్ ప్రీత్ ని టాలీవుడ్ దూరం పెట్టేసింది. రకుల్ లాస్ట్ ఫిలిం కొండ పొలం ఇచ్చిన షాక్ కి ఎవరూ రకుల్ పేరే ఎత్తడం లేదు. ఇక బరువు బాగా తగ్గి స్లిమ్ గా మారిన రకుల్ నార్త్ లో బిజీ అయ్యింది.
అక్కడి స్టార్ హీరోలతో నటిస్తూ.. బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ తో పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తూ.. అవకాశం వచ్చినప్పుడు మ్యాగజైన్ ఫోటో షూట్స్ తో అరాచకం సృష్టిస్తుంది. రకుల్ ట్రావెల్ పీకాక్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన బికినీ ఫోటో షూట్ సెగలు రాజేసేలా ఉంది. ఆరెంజ్ కలర్ బికినిలో, లూజ్ హెయిర్ తో, జాకెట్ వేసుకుని రకుల్ ఇచ్చిన ఫోజ్ చూస్తే అమ్మో రకుల్ హాట్ ఫోటో షూట్ మాములుగా లేదుగా అంటారు. చాలా అందంగా, అంతకుమించిన మెరుపులతో రకుల్ పిక్ చూడగానే నిజంగా వావ్ అనేలా ఉంది.