బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి - రాజ్ కుంద్రాలను ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది అశ్లీల చిత్రాల కేసులో జైలు పాలై అతి కష్టమ్మీద బెయిల్ పై బయటికి వచ్చిన రాజ్ కుంద్రా మీడియా కి దొరకడమే లేదు. కానీ శిల్పా శెట్టి మాత్రం తల్లితోను, చెల్లి షమితా శెట్టి తో, తన పిల్లల్తో నార్మల్ లైఫ్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత శిల్ప శెట్టి ఆమె తల్లి ఓ చీటింగ్ కేసులో ఇరుక్కుని ఇబ్బంది పడ్డారు. ఇక రీసెంట్ గా రాజ్ కుంద్రా - శిల్ప శెట్టి దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని, అందుకే రాజ్ కుంద్రా కోట్లాది రూపాయల ఆస్తులని శిల్పా శెట్టి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసాడనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే శిల్పా దంపతుల విడాకుల విషయమై ఎక్కడా స్పష్టత లేదు.
ఇప్పుడు మరోసారి శిల్పా శెట్టి మీడియాలో న్యూస్ అయ్యింది. వరస వివాదాలతో సతమతమైన శిల్ప శెట్టికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. అది ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా.. పన్ను ఎగ్గొట్టారని, అలాగే లోన్ కి సంబందించిన అమౌంట్స్ బ్యాంకు కి కట్టకుండా కాలయాపన చేస్తున్నారనే కేసులో ఈనెల 28 న శిల్పా శెట్టి ఆమె చెల్లి షమితా శెట్టి తో పాటుగా శిల్పా శెట్టి తల్లిని కూడా ముంబై లోని అంధేరి కోర్టుకు హాజరు కావాలని సమన్లు పంపారు ఐటి అధికారులు. మరి పన్ను, లోన్ ఎగవేత కేసులో శిల్పా శెట్టి మరోసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తుంది.