Advertisementt

తెలంగాణ ఓకె.. కానీ ఆంధ్రలో భయం వేసింది

Mon 14th Feb 2022 05:44 PM
dj tillu,dj tillu success tour,siddu jonnalagadda,vijayawada  తెలంగాణ ఓకె.. కానీ ఆంధ్రలో భయం వేసింది
DJ Tillu Success tour తెలంగాణ ఓకె.. కానీ ఆంధ్రలో భయం వేసింది
Advertisement
Ads by CJ

గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దు జొన్నలగడ్డ సినిమా టీజె టిల్లు థియేటర్స్ దగ్గర డీజే సౌండ్ పెంచేసింది. గత వారం విడుదలైన సీన్లని పక్కనబెట్టి మరీ ప్రేక్షకులు డీజే టిల్లు కి బ్రహ్మరధం పడుతున్నారు. డీజే టిల్లు సౌండ్ కి బాక్సాఫీసు షేక్ అవుతుంది.. ఆడియన్స్ కూడా నవ్వులు పూయిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే టీజె టిల్లు టీం.. ఇప్పుడు సక్సెస్ టూర్ అంటూ థియేటర్స్ లో వాలిపోయారు.

తెలంగాణా యాస తో వ‌స్తున్నాం ఎలా ఉంటుంది.. ఈ సినిమా నైజాం వ‌ర‌కూ మాకు ఎలాంటి సందేహాలు లేవు.. కానీ ఆంధ్ర‌లో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజ‌యవాడ‌లో ఆడియ‌న్స్ తో క‌ల‌సి చూసాక మంచి సినిమా ఎక్క‌డైనా మంచి సినిమానే అని ప్రేక్ష‌కులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు అనే క్యారెక్ట‌ర్ రాయ‌డం, చేయ‌డం ఒక క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్ష‌కులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజ‌యం అందించారు. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కిక్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మిమ్మ‌ల్ని ఏడిపించేంత న‌వ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ అన్నారు.. అంటూ సిద్దు జొన్నలగడ్డ విజవాడ ఆడియన్స్ కి థాంక్స్ చెపేప్సాడు 

DJ Tillu Success tour:

DJ Tillu Success tour Vijayawada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ