అల్లు అర్జున్ కి చెల్లి గా జులాయి సినిమాలో కనిపించిన శ్రీముఖి అప్పుడప్పుడు వెండితెర అదృష్టాన్ని పరిక్షించుకుంటూనే ఉంది. క్రేజీ అంకుల్స్ అంటూ మెయిన్ లీడ్ లో సినిమా చేసిన శ్రీముఖి నితిన్ మ్యాస్ట్రో మూవీలో పోలీస్ ఆఫీసర్ వైఫ్ గా గుర్తుండిపోయే కేరెక్టర్ లోను మెరిసింది. బుల్లితెర మీద యాంకర్ గా పలు షోస్ లో అందం అభినయం చూపిస్తుంది. బబ్లీ గా ఉన్నా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గదు. బుల్లితెర మీదే మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళింది. టైటిల్ ఫెవరెట్ గా వెళ్లి రన్నర్ గా నిలిచింది. బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు తనకో లవ్ బ్రేకప్ అయ్యింది అని చెప్పి ఎమోషనల్ అయిన ఆమె అది ఎవరితో అనేది బయట పెట్టలేదు.
యాంకర్ గాను, నటిగా బిజీగా ఉంటూనే ఖాళీ సమయాల్లో తన ఫ్రెండ్స్ అవినాష్, విష్ణు ప్రియా లతో కలిసి గోవా ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి తన లవ్ విషయంలో ఓ హింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే ఈ బబ్లీ యాంకర్ వాలెంటైన్స్ డే రోజున రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే తో ఓ పిక్ ని పోస్ట్ చేస్తూ.. ఫిబ్రవరి 14, 2022.. ఇది గుర్తు పెట్టుకోండి. మళ్లీ మాట్లాడుకుందాం. జీవితంలోనే బెస్ట్ వాలంటైన్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దానితో బబ్లీ బ్యూటీ శ్రీముఖి భలే హింట్ ఇచ్చింది. ఎవరితో ప్రేమలో ఉందొ కానీ ఆ విషయం ఇలా చెప్పకనే చెప్పేసింది.. శ్రీముఖి కి నచ్చిన, మెచ్చిన అతగాడెవరో అంటూ అప్పుడే నెటిజెన్స్ గూగుల్ సెర్చింగ్ స్టార్ట్ చేసేసారు.