క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఖిలాడీ మూవీ తో వెనకడుగు వేసాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలాడీ మూవీ బాక్సాఫీసు వద్ద ఢీలా పడింది. ఖిలాడీ రిజల్ట్ ఎలా ఉన్నా.. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ ని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు చకచకా షూటింగ్ చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. అలాగే త్రినాధ్ రావు నక్కిన తో చేస్తున్న ఢమాకా కూడా శరవేగంగా రెడీ అవుతుంది. రామారావు ఆన్ డ్యూటీ లో గవర్మెంట్ ఎంప్లొయ్ గా కనిపించబోతున్నాడు రవి తేజ.
ఇక ఢమాకా మూవీ పై లేటెస్ట్ గా తెలుస్తున్న న్యూస్ ఏమిటి అంటే.. ఈ సినిమాలో రవితేజ కాలేజ్ లెక్చరర్ గా కనిపిస్తాడట. స్టూడెంట్ గా పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. వాలెంటీటైన్స్ డే రోజున రవితేజ - శ్రీ లీల ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. అంటే ఈ సినిమా కథ లెక్చరర్ - స్టూడెంట్ మధ్యన లవ్ స్టోరీ గా ఉండబోతుంది అని తెలుస్తుంది. కానీ ఇదే ట్రాక్ తో రవితేజ ఆల్రెడీ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్ మూవీలో చేసేసాడు. అక్కడ స్టూడెంట్ రిచా గంగోపాధ్యతో హిందీ లెక్చరర్ అయిన రవితేజ ప్రేమలో పడతాడు. మళ్ళీ సేమ్ ట్రాక్ సేమ్ హీరో చెయ్యడం ఆడియన్స్ కి రొటీన్ అనిపిస్తుందేమో.. అంతా తెలిసి రవితేజ ఈ స్టోరీ ని ఎలా ఓకె చేసాడో.. మరి ఆ స్టోరీ లో అంత ఫన్ ఏం జనరేట్ చేసాడో దర్శకుడు చూడాలి.