Advertisementt

చై అప్పుడిచ్చాడు.. ఇపుడు అడుగుతున్నాడు

Fri 18th Feb 2022 11:53 AM
naga chaitanya pooja hegde pair up again,pooja hegde with naga chaitanya in venkat prabhu film,maanaadu director venkat prabhu movie with naga chaitanya and pooja hegde  చై అప్పుడిచ్చాడు.. ఇపుడు అడుగుతున్నాడు
Naga Chaitanya - Pooja Hegde Combo Strikes Again చై అప్పుడిచ్చాడు.. ఇపుడు అడుగుతున్నాడు
Advertisement
Ads by CJ

ఇప్పుడంటే పూజ హెగ్డే క్రేజీ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది కానీ కెరీర్ బిగినింగ్ డేస్ లో ఎదురైన ఫ్లాపులు తనని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆయితే లక్కీగా డీజే సినిమాతో పూజ సుడి తిరిగింది. ఆపై త్రివిక్రమ్ సపోర్ట్ దొరికింది. దాంతో స్టార్ హీరోల సరసన సినిమాలు వచ్చాయి. వరుస విజయాలు వరించాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీ బిజీ గా ఉంటోన్న పూజ షూటింగ్ గ్యాప్స్ ని సైతం ఫ్లైట్ జర్నీల్లోనే గడపాల్సి వస్తోందట.! ఈ నేపథ్యంలో చైతు రూపంలో ఓ కొత్త చిక్కొచ్చింది పూజకి.

హీరోయిన్ గా పూజ హెగ్డే ఫస్ట్ ఫిల్మ్ ముగమూడి (తెలుగులో మాస్క్) డిజాస్టర్ అయినప్పటికీ తమ సొంత సినిమా అయిన ఒక లైలా కోసంలో తన సరసన చేసే ఛాన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. అది అప్పట్లో సోసోగానే ఆడినప్పటికీ చైతు - పూజల పెయిర్ అయితే ముచ్చటగానే అనిపించింది. కాగా మళ్ళీ ఎనిమిదేళ్ల తరువాత మరోసారి నాగ చైతన్య - పూజ హెగ్డేల జోడీకి పని పడిందట. తమిళ సూపర్ హిట్ మానాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు చేయనున్న సినిమాకి పూజని సంప్రదిస్తున్నారు. మరి అప్పుడు అవకాశం ఇచ్చిన నాగ చైతన్య సరసన కనుక అడిగిన వెంటనే పూజ అంగీకరించే అవకాశమే ఉందని అంటున్నారు సినీ జనం. అందులోనూ సదరు సినిమా షూటింగ్ కి తన వర్కింగ్ డేస్ కూడా తక్కువే అవడంతో పూజ ఈజీగానే డేట్స్ అడ్జస్ట్ చేసేస్తుందిలే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

Naga Chaitanya - Pooja Hegde Combo Strikes Again:

Pooja Hegde Entering In to Naga Chaitanya - Venkat Prabhu Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ