శర్వానంద్ - రష్మిక కలయికలో ఫిబ్రవరి 25 న థియేటర్స్ లోకి రాబోతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని సినిమాపై ఫ్యామిలీ ఎంటటైనేర్ ముద్ర వేసాయి. రష్మిక లుక్స్, శర్వానంద్ లుక్స్ అన్ని ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక రేపు ఈవెనింగ్ జరగబోయే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆ సినిమా టైటిల్ కి తగ్గట్టే చీఫ్ గెస్ట్ లుగా ఇద్దరు అందమైన హీరోయిన్స్ ని ఇన్వైట్ చేసారు.
అందులో ప్రస్తుతం కళావతి సాంగ్ తో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మహానటి కీర్తి సురేష్ ఒకరు కాగా.. శ్యామ్ సింగ రాయ్ లో రోజీ కేరెక్టర్ లో అద్భుతమైన పెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్న సాయి పల్లవి లని ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి అతిధులుగా రాబోతున్నారు. రష్మిక మందన్న, కీర్తి సురేష్, సాయి పల్లవి.. ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు అని తెలుస్తుంది.