Advertisementt

బిగ్ బాస్ గ్లామర్ కోసం భారీగా డిమాండ్

Fri 18th Feb 2022 08:29 PM
bigg boss 6,telugu top contestants,bigg boss telugu ott,nagarjuna  బిగ్ బాస్ గ్లామర్ కోసం భారీగా డిమాండ్
Big demand for Bigg Boss glamor బిగ్ బాస్ గ్లామర్ కోసం భారీగా డిమాండ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి కోసం హాట్ స్టార్ అన్ని రెడీ చేసేసింది. ఈ నెల 26 నుండి మొదలు కాబోయే బిగ్ బాస్ తెలుగు ఓటిటి లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ కూడా ఫైనల్ అయ్యారు. వాళ్ళని మరో రెండు రోజుల్లో క్వారంటైన్ కి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్. నాగార్జున హోస్ట్ గా గ్రాండ్ గా ఈ 26 న హౌస్ మేట్స్ 15 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. బిగ్ బాస్ అంటేనే గ్లామర్, లవ్ ట్రాక్, ఫన్, ఫైటింగ్స్. అందులో అతి ముఖ్యమైనది గ్లామర్ షో. ఈసారి బిగ్ బాస్ ఓటిటిలో మాములు గ్లామర్ ఉండదట. 24 గంటలూ నీట్ గా రెడీ అయ్యి.. గ్లామర్ షో చెయ్యడానికి షోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ భారీగా డిమాండ్ చేస్తున్నారట. అది కూడా గ్లామర్ కాస్ట్యూమ్స్ కోసం.

ఈసారి పాత సీజన్స్ నుండి ముమైత్, తేజస్వి మడివాడ, అరియనా గ్లోరీ, హమీదా, ఆశు రెడ్డి లు బిగ్ బాస్ ఓటిటి లోకి ఎంటర్ అవ్వబోతున్నారట. వారికి రోజుకి 25 వేలు పారితోషకం ఇవ్వబోతున్నారట. అందులో వాళ్ళ కాస్ట్యూమ్స్ కే ఎక్కువ ఖర్చు అవుతుంది అని.. వీరంతా గ్లామర్ షో చేసందుకు అనుగుణమైన డ్రెస్సుల కోసమే భారీగా డిమాండ్ చేసారని, ఆ గ్లామర్ బిగ్ బాస్ కి అవసరం కాబట్టి.. బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు అడిగింది కాదనకుండా ఇచ్చేస్తున్నారట. ఇక వీరితో పాటుగా మహేష్ విట్టా, తనీష్, ఆదర్శ్, రోల్ రైడా, అఖిల్ లు మాజీ కంటెస్టెంట్స్ గా..  యాంకర్ శివ, ఆర్జే చైతు, భమ్ చిక్ బబ్లు ఇంకొంతమంది కొత్త కంటెస్టెంట్స్ గా బిగ్ బాస్ ఓటిటిలోకి ఎంటర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. 

Big demand for Bigg Boss glamor:

Big demand for Bigg Boss 6 telugu top contestants

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ