ఫిబ్రవరి 25 న వరుణ్ తేజ్ - శర్వానంద్ - కిరణ్ అబ్బవరం మధ్యన బాక్సాఫీసు ఫైట్ ని రసవత్తరంగా మార్చేశారు భీమ్లా నాయక్ మేకర్స్. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని అదే రోజు విడుదలకు సిద్ధం చేసి అధికారిక ప్రకటన ఇవ్వడంతో యంగ్ హీరోలు టెంక్షన్ పడినా.. శర్వానంద్ తన సినిమా పై ఉన్న నమ్మకంతో అదే రోజు ఆడవాళ్లు మీకు జోహార్లు తో రావడానికి మెంటల్ గా ప్రిపేర్ అవడమే కాదు.. ప్రమోషన్స్ తో తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ప్రకటించే రోజే వరుణ్ తేజ్ గని మూవీ రిలీజ్ ప్రకటన వచ్చింది. భీమ్లా నాయక్ ప్రకటనతో గని రిలీజ్ అయోమయంలో పడింది.
ఇప్పటికే రెండు మూడు డేట్స్ మార్చుకుంది గని. గత ఏడాది డిసెంబర్ 25 నే రిలీజ్ అవ్వాల్సిన గని మార్చి 25 కి వెళ్ళింది. తర్వాత మళ్లీ ఫిబ్రవరి 25 కి డేట్ చేంజ్ చేసారు మేకర్స్. ఇప్పుడేమో భీమ్లా నాయక్ తో గని కి పెద్ద గండం ఏర్పడింది. ఒకే రోజు బాబాయ్ - అబ్బాయ్ ఫైట్ అంటే హీరోలే ఒప్పుకోరు. అందుకే గని రిలీజ్ డేట్ ఇచ్చి నామ్ కా వాస్త్ అంటూ ప్రమోషన్స్ మొదలు పెట్టినా ఇప్పుడు గని డేట్ మారడం పక్కగానే కనబడుతుంది. ఎందుకంటే గని ప్రమోషన్స్ కూడా ఆపేసింది టీం. ఇక అఫీషియల్ గా గని పోస్ట్ పోన్ ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ డేట్ కూడా మారొచ్చు అంటున్నారు.