Advertisementt

ఫిక్స్: భీమ్లాకి కేటీఆర్ సపోర్ట్

Sat 19th Feb 2022 01:18 PM
ktr,pawan kalyan,sagar k chandra,trivikram,rana,janasena leader pawan,bheemla nayak pre release event  ఫిక్స్: భీమ్లాకి కేటీఆర్ సపోర్ట్
Bheemla Nayak pre release event details ఫిక్స్: భీమ్లాకి కేటీఆర్ సపోర్ట్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో తెరకెక్కిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న రిలీజ్ కాబోతుంది. దానితో పవన్ ఫాన్స్ లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. భీమ్లా నాయక్ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడమే తరువాయి.. సెన్సార్ కంప్లీట్ చేసేసారు. యు/ఏ సర్టిఫికెట్ తో భీమ్లా నాయక్ రాబోతుంది. ఇక ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో మొదలు పెట్టారు. భీమ్లా నాయక్ ట్రైలర్ లోడింగ్ అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తాజాగా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్లేసు.. చీఫ్ గెస్ట్ లు కన్ ఫర్మ్ అయ్యారు. మహేష్ బాబు, మెగాస్టార్ చిరు భీమ్లా నాయక్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లుగా వస్తారని అంటున్నా.. పవన్ కళ్యాణ్ తో స్టేజ్ పైకి రాబోతుంది మాత్రం తెలంగాణ మినిస్టర్ కేటీఆర్.

ఫిబ్రవరి 21 సాయంత్రం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీమ్లా నాయక్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ కేటీఆర్. భీమ్లా భుజం తట్టి కేటీఆర్ ఎలాంటి స్పీచ్ ఇస్తారో కానీ..  ఒకే స్టేజ్ పై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - కేటీఆర్ అంటే ఆ ఈవెంట్ ని ఎంత ప్రత్యేకత ఉందో అర్ధమవుతుంది. అటు పవన్ ఫాన్స్, ఇటు టిఆర్ ఎస్ అభిమానులతో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈవెంట్ నిర్వాహకులు ఈ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకల పర్మిషన్స్ తీసుకునే పనిలో ఉన్నారు.

Bheemla Nayak pre release event details:

KTR to attend Bheemla Nayak pre release event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ