Advertisementt

కమెడియన్స్ కరువైనా.. తగ్గేదేలే

Sat 19th Feb 2022 10:50 PM
jabardasth,comedians,etv,star maa,star maa comedy stars  కమెడియన్స్ కరువైనా.. తగ్గేదేలే
Jabardasth Comedians Entry In Star Maa Comedy Stars కమెడియన్స్ కరువైనా.. తగ్గేదేలే
Advertisement
Ads by CJ

ఈటివిలో గురు, శుక్రవారాల్లో ప్రసరమవుతున్న జబర్దస్త్ ప్రస్తుతం కమెడియన్స్ లేక వెల వెలబోతుంది అనుకుంటే పొరబాటే. ఎందుకంటే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ఇక్కడ ఏడాది అగ్రిమెంట్ పూర్తవ్వగానే స్టార్ మాకి జంప్ చేసారు. పొలోమంటూ స్టార్ మా కామెడీ స్టార్స్ కి తరలిపోయారు. అదిరే అభి, నారాయణ, అవినాష్, ఆర్పీ ఇలా చాలామంది జబర్దస్త్ వాళ్ళు వెళ్లిపోయారు. దానితో జబర్దస్త్ జెడ్జెస్ అయిన రోజా, మనో ఆఖరికి యాంకర్స్ అయిన రష్మీ, అనసూయలు కామెడీ స్కిట్స్ లోకి వచ్చేసి కామెడీ చేస్తూ జబర్దస్త్ ని ముందుకు నడిపిస్తున్నారు. బుల్లెట్ భాస్కర్, సుధాకర్, చంటి లు కూడా కొత్తరకమయిన స్కిట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక హైపర్ ఆది విషయం చెప్పక్కర్లేదు. అదిరిపోయే కామెడీ పంచెస్ తో ఆకట్టుకుంటున్నాడు. రోజా హోమ్ టూర్ స్కిట్ నిజంగా అదిరిపోయింది. అందులో రోజా ఇంటిని చూపించారు. అలాగే రష్మీ కూడా సుధీర్ ని ఇంటరాగేట్ చేసే స్కిట్ చేసింది. అనసూయ అయిపోతే హైపర్ ఆదికి ఎప్పుడూ సపోర్ట్ ఇస్తుంది. సుధీర్, గెటప్ శ్రీను లు వాళ్ళ కామెడీ తో ఇరగదీస్తున్నారు. ఇక ఫైమా కామెడీకి ప్రేక్షకులు పడి పడి నవ్వుతున్నారు. ఇక మనో అప్పుడప్పుడు స్కిట్స్ లో స్పెషల్ గా మెరుస్తుంటారు. కమెడియన్స్ కరువైన జబర్దస్త్ అంటున్నా.. జెడ్జెట్ కూడా కామెడిలోకి దిగిపోయి జబర్దస్త్ ని కింద కి పడనివ్వడం లేదు. కానీ స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ స్కిట్స్ లో జబర్దస్త్ కమేడియన్స్ చేసే స్కిట్స్ చూస్తే అవి జబర్దస్త్ స్కిట్స్ లాగే అనిపిస్తున్నాయి తప్ప.. కొత్తగా చూసినట్టు లేవు అంటున్నారు నెటిజెన్స్.

Jabardasth Comedians Entry In Star Maa Comedy Stars:

Comedians thirsty Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ