ఫిబ్రవరి 25 న యంగ్ హీరోలు బరిలోకి దిగుదామని శర్వా ఆడవాళ్లు మీకు జోహార్లు, కిరణ్ అబ్బవరం సెబాస్టియన్, వరుణ్ తేజ్ గాని మూవీస్ రిలీజ్ డేట్స్ ఇస్తే.. పవర్ స్టార్ అనూహ్యంగా భీమ్లా నాయక్ ని రేస్ లోకి దించేసరికి యంగ్ హీరోలకి ఎటూ పాలుపోలేదు. దానితో ఒకొక్కరిగా ఆ డేట్ నుండి వెనక్కి తగ్గి మార్చ్ 4th కి తమ సినిమాల డేట్ మార్చుకున్నారు. వరుణ్ తేజ్ కామ్ గానే ఉన్నా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లని మాత్రం మార్చి 4th రిలీజ్ అంటూ డేట్ ఇచ్చేసాడు. ఆ వెంటనే సెబాస్టియన్ తో కిరణ్ అబ్బవరం కూడా మార్చి 4th కే వస్తున్నా అంటున్నాడు.
రాజావారు రాణిగారు సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ఓపేరు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ఎస్.ఆర్. కళ్యాణమండపంతో కూడా మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు-మాసు, యూత్- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మార్చి 4న సెబాస్టియన్ పిసి 524తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు.