ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికై మెగాస్టార్ చిరు నడుం కట్టుకుని మరీ.. సీఎం జగన్ రెడ్డి చుట్టూ ప్రదక్షణలు చేసి టాలీవుడ్ సమస్యలని చక్కబెట్టారు. టికెట్ రేట్స్ పెంచేలా జగన్ తో మాట్లాడడం, అలాగే ఐదో ఆటకి అనుమతి తీసికురావడం, టాలీవుడ్ స్టార్ హీరోలని తమ వెంట తీసుకురావడం, జగన్ తో మాట్లాడి ఇండస్ట్రీ సమస్యలని ఓ కొలిక్కి తెచ్చారు. ఎవ్వరు ఎమన్నా చిరు చేతులు కట్టుకుని జగన్ ముందు నిలబడినా.. అది ఇండస్ట్రీ కోసమే చేశారాయన. పెద్ద హీరోలు కూడా జగన్ ముందు నించుని ఆయనకి థాంక్స్ చెప్పారంటే.. అది ఇండస్ట్రీ కోసమే అని చాలామంది అన్నారు, అంటున్నారు. కానీ కొంతమంది చిరు అండ్ కో జగన్ ముందు అడుక్కోవడం నచ్ఛలేదు అంటూ బహిరంగానే విమర్శించారు.
మరి మెగాస్టార్ పరిస్థితిని ఆల్మోస్ట్ చక్కబెడితే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇండస్ట్రీ సమస్యని మొదటికి తెచ్చినట్టుగా అయ్యింది ప్రస్తుత వ్యవహారం. ఏదో మత్స్య కారుల సభలో మాట్లాడి.. వారికి మద్దతుగా ఏపీ ప్రభుత్వంపై నిందలు వేస్తారనుకున్న పవన్ కళ్యాణ్.. అన్న చిరు చేసిన పనిని చెడగొట్టినట్లుగా అయ్యింది. జగన్ తో ప్రముఖుల భేటీపై ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ.. సమస్యని పెద్దది చేసి చూపించి.. వాళ్ళని తన ముందు చేతులు కట్టుకుని మోకరిల్లేలా చేస్తేనే ఈగో శాటిస్ ఫై అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ జగన్ - మెగాస్టార్ చిరు మీటింగ్ పై తన వెర్షన్ లో కామెంట్స్ చేసారు. దానితో మళ్ళీ ఇండస్ట్రీ సమస్య మొదటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అన్న పరిష్కరిస్తే, తమ్ముడు చెడగొట్టాడు అంటున్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు.