కెజిఎఫ్ తో ఒక్కసారిగా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యశ్ తో కెజిఎఫ్ 2 మూవీ చేస్తూనే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ ప్రాజెక్ట్ కమిట్ చేయించడం.. సెట్స్ మీద కి తీసుకెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. కెజిఎఫ్ లోని హీరో ఎలివేషన్ సీన్స్ కి టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రశాంత్ నీల్ కి పడిపోయారు. కన్నడ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ నిర్మాణంలో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ ని గోదావరి ఖని బొగ్గు గనుల్లో మొదలు పెట్టారు. ఇప్పటికే సలార్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లుగా తెలుస్తుంది.
అయితే సలార్ అనుకున్న బడ్జెట్ కి ఇప్పుడు ఖర్చు పెడుతున్న బడ్జెట్ కి పొంతన లేదని.. ఇప్పటికే సలార్ బడ్జెట్ కోట్లు దాటేసింది అనే టాక్ వినిపిస్తుంది. 250 పైనే సలార్ బడ్జెట్ ఉండబోతుంది అనే టాక్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది. ప్రభాస్ పారితోషకం పోను, సలార్ లో మాస్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు చాలా ఖర్చు పెడుతున్నారట. కెజిఎఫ్ లో ఆ యాక్షన్ సన్నివేశాలే హైలైట్ అవ్వడంతో.. నిర్మాతలు ప్రశాంత్ నీల్ అడిగింది కాదనకుండా.. భారీ సెట్ల నిర్మాణంతో పాటుగా.. బడ్జెట్ ని లెక్కలేనంతగా పెట్టేస్తున్నారట. మరి ప్రభాస్ మీద ఎంత పెట్టినా దానికి డబుల్ తీసుకొచ్చే క్రేజ్, సత్తా ప్రభాస్ కి ఉన్నాయి. అందుకే నిర్మాతలు బడ్జెట్ పరిధులు దాటినా లెక్క చెయ్యడం లేదట.