భీమ్లా నాయక్ నుంచి వచ్చిన ప్రతి పాటకీ పట్టం కట్టారు అభిమానులు. అలాగే గ్లిమ్ప్స్ కీ రికార్డు వ్యూసునీ, లైక్స్ నీ కట్టబెట్టారు. అయితే అక్కడితోనే ఆవిరైపోయింది వారి ఆనందం. రిలీజ్ డేట్ విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ భీమ్లాకి అసలు టీజర్ అనేదే లేకుండా చేసేసింది. సరే ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో హడావిడి షురూ అనుకుంటే అది కాస్తా అనూహ్య కారణంతో వాయిదా పడింది. విడుదల తేదీకి సరిగ్గా నాలుగు రోజులే ఉన్నప్పటికీ సరైన ప్రమోషనల్ కంటెంట్ ఏది లేకుండా అయిపోయిన తరుణంలో...
కళ్ళు మిరుమిట్లు గొలిపే మిస్సైల్ లా దూసుకువచ్చింది భీమ్లా నాయక్ ట్రైలర్.
దెబ్బకి ఫ్యాన్స్ దిమ్మ తిరిగిపోయింది. సౌండ్ బాక్సుల దుమ్ము రేగిపోయింది.
ఊర మాస్ అవతార్ లో ఊపేసిన పవన్ కళ్యాణ్ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా భీమ్లా నాయక్ పొందే ఓపెనింగ్సుని అమాంతం రెట్టింపు చేసేసే రేంజ్ లో అద్దిరిపోయింది. త్రివిక్రమ్ రాసిన ఎక్సలెంట్ డైలాగ్స్ తో - థమన్ చేసిన ఎక్సట్రార్డినరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో - సాగర్ చంద్ర తీసిన వండ్రఫుల్ విజువల్స్ తో కేవలం పవన్ ఫ్యాన్సునే కాక మాస్ మూవీ లవర్స్ అందరినీ భీమ్లా మానియాలోకి లాగేస్తోన్న ఆ ట్రైలర్ ఎలా ఉందంటే...
బీమ్లా నాయక్ అనే వ్యక్తి ఆత్మ గౌరవానికి - డేనియల్ శేఖర్ అనే వ్యక్తి అహంకారానికి నడుమ జరిగే పోరే ఈ సినిమా సబ్జెక్ట్ అనేది మ్యాగ్జిమమ్ అందరికీ తెలిసిందే. అదే అంశం మరింత స్ట్రాంగ్ గా ట్రైలర్ లో స్పష్టం అయింది. భీమ్లా క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయిందో... డానీగా అదే స్థాయిలో చెలరేగిపోయారు దగ్గుబాటి రానా. పోటా పోటీగా ఉన్న ఈ ఇద్దరి నాటు స్క్రీన్ ప్రెజన్స్ రేపు థియేటర్స్ లో అభిమానులకి సెగలు పుట్టించడం.. పూనకాలు పట్టించడం ఖాయం. ప్రేక్షకుల చేత కేకలు పెట్టించడం.. విజిల్స్ కొట్టించడం తధ్యం.
మరి ఫిబ్రవరి 25 నుంచీ విశ్వవ్యాప్తంగా మొదలయ్యే బీభత్సమైన భీమ్లా నాయక్ జాతరలో ఏ స్థాయి వసూళ్లు వెల్లువెత్తుతాయో.. ఎన్ని బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవుతాయో లెక్కలు తేల్చాల్సిన పని ట్రేడ్ వర్గాలది. ఆ లెక్కలు చుక్కలు తాకేలా చెయ్యాల్సిన భాద్యత అభిమాన ప్రేక్షకులది.!