Advertisementt

ప్రభాస్ పక్కనంటే ఊఁ అనాల్సిందే.!

Tue 22nd Feb 2022 03:05 PM
prabhas,pan india star,prabhas - maruti combo,project k,adipurush,spirit,radhe shyam,samantha,maruti film,prabhas - samantha combo  ప్రభాస్ పక్కనంటే ఊఁ అనాల్సిందే.!
Prabhas to romance Samantha? ప్రభాస్ పక్కనంటే ఊఁ అనాల్సిందే.!
Advertisement
Ads by CJ

ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్. ఆయన పక్కన హీరోయిన్ గా నటించేందుకు ఎవ్వరైనా ఊఁ అనాల్సిందే. ప్రస్తుతం పూజ హెగ్డే తో రాధే శ్యామ్ చేసిన ప్రభాస్, ప్రాజెక్ట్ కే లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే తో రొమాన్స్ చేస్తున్నారు. అలాగే ఆదిపురుష్ లో ప్రభాస్ పక్కన కృతి సనన్ నటిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ - మారుతీ కాంబోలో ఓ మూవీ ఉండబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, ప్రభాస్  ముగ్గురు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అది ఎంతవరకు నిజమనేది.. అతి త్వరలోనే క్లారిటీ రాబోతుంది. సన్నిహితుల సమాచారం మేరకు సరికొత్త కలయికని ఈ సినిమాలో చూడబోతున్నాం. ప్రభాస్ సరసన సమంత నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ పక్కన సమంత ఇంతవరకు నటించలేదు. అందుకే ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఓ కేరెక్టర్ కి సమంత ని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ముందు ఈ పాత్రకి కియారా అద్వానీని అనుకున్నా.. ఆమె RC15 ప్రాజెక్ట్ తో లాక్ అయ్యి ఉండడంతో.. మారుతీ - ప్రభాస్ ప్రాజెక్ట్ కోసం.. మేకర్స్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన  సమంత ని సంప్రదించగా.. సమంత కూడా ప్రభాస్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. మరి ఈ గాసిప్ అయినా నిజమవుతుందా? లేదంటే అన్ని గాసిప్స్ లో కలిసిపోతుందో?

Prabhas to romance Samantha?:

Prabhas to romance Samantha for Maruti Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ