Advertisementt

రాఘవ్ పాత్రలో ఆదిపురుష్ ప్రభాస్

Tue 22nd Feb 2022 08:50 PM
prabhas,om raut,adipurush update,adipurush movie,kriti sanon,saif ali khan,prabhas as raghav,kriti as janaki,saif as lankesh  రాఘవ్ పాత్రలో ఆదిపురుష్ ప్రభాస్
Adipurush secrets out రాఘవ్ పాత్రలో ఆదిపురుష్ ప్రభాస్
Advertisement
Ads by CJ

ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో 3D ఫిలిం గా తెరకెక్కుతున్న అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ ఆదిపురుష్ షూటింగ్ ని ప్రభాస్ ఎప్పుడో కంప్లీట్ చేసేసారు. ప్రస్తుతం దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమాలో రామ్ గా ప్రభాస్, సీత గా కృతి సనన్, రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఆది పురుష్ సినిమాను టెక్నికల్ వండర్‌గా మ‌ల‌చ‌డానికి డైరెక్ట‌ర్ ఓం రౌత్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆదిపురుష్ ని ఆగష్టు 11 2022 న రిలీజ్ చేస్తామంటూ గత ఏడాదే డేట్ లాక్ చేసి పెట్టినా.. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కోసం ఆదిపురుష్ డేట్ ని ప్రభాస్ అండ్ మేకర్స్ త్యాగం చేసారు.

మళ్ళీ కొత్త డేట్ ఎనౌన్సమెంట్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఓం రౌత్ ఆదిపురుష్ సీక్రెట్స్ ని రివీల్ చేసి ప్రభాస్ ఫాన్స్ ని కూల్ చేసారు. ఆదిపురుష్ లో అంతగా ఆకట్టుకునే సీక్రెట్స్ ఏమిటి అంటే.. ఆదిపురుష్ కథ ఏడు వేల సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన రామాయ‌ణంను బేస్ చేసుకుని తీసిన సినిమా అని, కాకపోతే అప్పటి రామాయణాన్ని నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు ఆదిపురుష్ ని మలిచామని ఓం రౌత్ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్ర‌భాస్ పేరు రామ్ కాదట. ప్రభాస్ పేరు రాఘ‌వ్ అని, అలాగే కృతి స‌న‌న్ పేరు సీత కాదని, ఆమె పేరు జాన‌కి అని, ఇంకా విలన్ పాత్రధారి రావ‌ణాసురుడుగా న‌టించిన సైఫ్ అలీఖాన్ పేరు లంకేష్ అని ఆదిపురుష్ కేరెక్టర్స్ నేమ్స్ రివీల్ చేసేసారు ఓం రౌత్.. దానితో ఇప్పటివరకు ప్రభాస్ రాముడి అవతార్ లో కనిపిస్తాడనుకుని సంబర పడిన ప్రభాస్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయినా.. ఓం రౌత్ హామీతో వాళ్ళు కుదుటపడ్డారు.

Adipurush secrets out:

Om raut about Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ