Advertisementt

కిరణ్ అబ్బవరం మరో సెన్సేషన్

Wed 23rd Feb 2022 11:46 AM
kiran abbavaram,nenu meeku baaga kaavalsina vaadini,nenu meeku baaga kaavalsina vaadini first look  కిరణ్ అబ్బవరం మరో సెన్సేషన్
Kiran Abbavaram new film titled కిరణ్ అబ్బవరం మరో సెన్సేషన్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరస చిత్రాలతో పరుగులు పెడుతున్నాడు. రాజావారు రాణి వారు సినిమాతో హీరోగా మారిన కిరణ్ అబ్బవరం SR కల్యాణ మండపం సినిమా తర్వాత సెబాస్టియన్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసాడు. మార్చి 4న సెబాస్టియన్ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఇక సమ్మతమే అంటూ మరో ప్రాజెక్ట్ చేస్తున్న కిరణ్ అబ్బవరం కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో మరో మూవీ చేస్తున్నాడు. శ్రీ కోడి రామ‌కృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా డెబ్యూ డైరెక్టర్ కార్తిక్ శంక‌ర్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ రివీల్ చేసింది టీం.

ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. కోడి రామ‌కృష్ణ గారు చిత్రాలన్ని ఫ్యామిలీ అంతా థియాటర్ కి పిక్నిక్ గా వెళ్ళి చూసేవారు. ప్ర‌తి ప్రేక్ష‌కుడికి బాగా కావాల్సిన వాడిలా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌లిసిపోవ‌డం, ఈ చిత్ర కథ కూడా అన్ని ఎమోష‌న్స్ తో రావ‌డంతో ఈ చిత్రానికి నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ల‌వ‌ర్ బాయ్ లుక్ చూసిన ప్రేక్ష‌కులు ఒకే సారిగా మాస్ క‌మ‌ర్షియ‌ల్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. టాలీవుడ్ లో వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోల స‌ర‌స‌న చేరేలా ఈ లుక్ వుండ‌టం విశేషం. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోని ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారు

Kiran Abbavaram new film titled:

Kiran Abbavaram Nenu Meeku Baaga Kaavalsina Vaadini first look 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ