రామ్ చరణ్ - కోలీవుడ్ సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో మొదలైన RC 15 షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈమధ్యనే రామ్ చరణ్ RC15 షూటింగ్ లో పాల్గొనడానికి రాజమండ్రి వెళ్లారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అంజలి, శ్రీకాంత్ అలాగే హీరోయిన్ కియారా అద్వానీ అంతా ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. క్రేజీ కాంబోలో మొదలైన ఈ మూవీ లో విలన్ గా కోలీవుడ్ ఆక్టర్ ఎస్ జె సూర్య నటిస్తున్నాడు. అటు కోలీవుడ్ కి ఇటు తెలుగులో క్రేజ్ ఉన్న సూర్య అయితే విలన్ గా బావుంటుంది అని శంకర్ అనుకున్నారట.
అయితే RC 15 లో రామ్ చరణ్ సిబిఐ ఆఫీసర్ గా నటించబోతున్నాడనే ప్రచారం జరిగినా లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాలో ఎలక్షన్ ఆఫీసర్ గాను, విలన్ ఎస్ జె సూర్య సీఎం కేరెక్టర్ లోను కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. సీఎం vs ఎలక్షన్ కమిషనర్ కి మధ్యన జరిగే పోరే RC 15 కథ అంటున్నారు. పర్ఫెక్ట్ ఐపీఎస్ అధికారిగా రామ్ చరణ్, ఈగో లక్షణాలతో సీఎం కేరెక్టర్ లో సూర్య కనిపిస్తారట. హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లోనే కనిపిస్తారని తెలుస్తుంది.