Advertisementt

శర్వా కోసం కలం కదిపిన దేవి

Wed 23rd Feb 2022 02:20 PM
mangalyam song,sharwanand,rashmika mandanna,tirumala kishore,slvc,aadavaallu meeku johaarlu movie  శర్వా కోసం కలం కదిపిన దేవి
Mangalyam Song From Aadavaallu Meeku Johaarlu శర్వా కోసం కలం కదిపిన దేవి
Advertisement
Ads by CJ

శర్వానంద్ - రష్మిక కలయికలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో మార్చి 4 న విడుదలకు సిద్దమవుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ పై అంచనాలు పెరిగేలా చేస్తుంది టీం. ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి రిలీజ్ అయిన టీజర్, మూడు సాంగ్స్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా సినిమాపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. శర్వానంద్ లుక్స్, రష్మిక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్స్, సాంగ్స్ లో రష్మిక గ్లామర్ అన్ని స్పెషల్ గా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి మాంగళ్యం తంతునానేన.. మన లైఫ్ లో ఇది జరుగునా.. అంటూ సినిమాలోని నాలుగో పాటని, శర్వా సాంగ్ ని రిలీజ్ చేసారు.

అయితే ఈ మాంగళ్యం సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడమే కాదు .. శర్వా కోసం దేవి నే కలం కదిపాడు. మాంగళ్యం తంతునానేన అనే శ్లోకాన్ని స్టైలిష్ స్టెప్పులతో శర్వానంద్ తన చిరాకు అంతా చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ నంబర్‌కు జస్‌ప్రీత్ జాస్ స్వరాలు అందించారు. ఆడవాళ్లు మీకు జోహార్లు నుండి రిలీజ్ అయిన ఈ నాలుగో సాంగ్ చాలా స్టైలిష్ ఉండడమే కాదు.. లిరిక్స్ బ్యూటిఫుల్ గా, వినసొంపుగా, కూల్ గా అనిపిస్తున్నాయి. శర్వానంద్ సాంగ్ కి మెయిన్ అట్రాక్షన్ కాగా.. దేవిశ్రీ రాసిన ఈ సాంగ్ కూల్ గా ఎక్కేసేలా ఉంది. 

Mangalyam Song From Aadavaallu Meeku Johaarlu:

Mangalyam Song From Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC Aadavaallu Meeku Johaarlu Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ