Advertisementt

మొహం పగిలిపోద్దంటున్న నాని

Wed 23rd Feb 2022 05:43 PM
nani,ante sundaranki,nazriya nazeem,vivek athreya,mythri movie makers,suhaas,harshavardhan  మొహం పగిలిపోద్దంటున్న నాని
Ante Sundaraniki Barthhday Homam Unveiled మొహం పగిలిపోద్దంటున్న నాని
Advertisement
Ads by CJ

నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన అంటే సుందరానికి షూటింగ్ పూర్తయ్యి, ప్రొడక్షన్ పనులు పూర్తయినందున వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. అయితే అందరూ రెండు డేట్స్ ఇస్తే నేను 7 డేట్స్ డేట్స్ ఇస్తా అంటూ మే నెల మొదలుకుని జూన్ వరకు కొన్ని డేట్స్ పై కచ్చిఫ్ వేసుకున్నారు మేకర్స్. తాజాగా నానికి ముందే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీమ్ కాసేపటి క్రితం అంటే సుందరానికి బర్తడే హోమాన్ని మొదలు పెట్టింది. ఈ సినిమాలో నాని కేరెక్టర్ తన కుటుంబం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొనే అమాయక బ్రాహ్మణుడు గా ఉండబోతుంది. అతని జీవితంలో అనేక గండాలు (చెడు సంఘటనలు) ఉన్నందున అతని ఫ్యామిలీ అతనిని ఇంటిలో చాలా తరచుగా హోమం చేయమని బలవంతం చేస్తారు.

కానీ నాని చిన్నపిల్లాడిలా అమ్మా, అమ్మమ్మతో వాదించేవాడు. ఓపుట్టిన రోజున చేసిన హోమంతో చిరాకొచ్చిన నాని.. ఇంకో హోమం చేస్తే ఎక్కువ హోమాలు చేసిన వాడిలా గిన్నిస్ బుక్ ఎక్కుతాను.. అని ఈ హోమాలు చేయమన్న అమ్మమ్మ మొహం పగిలిపోతుంది అంటాడు.. అంతలో ఎవరి మొహం పగులుతుందిరా అని ఆవిడ అనగానే.. నా మొహమే.. నా మొహం పగులుద్ది అంటాడు ఫన్నీగా.. 

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఏ కథని అయిన.. కామెడీ తో మిక్స్ చేసి ఆడియన్స్ ని నవ్వించేసినట్టుగానే అంటే సుందరానికి సినిమాలోనూ అదే కామెడీ కాన్సెప్ట్ వాడి నాని పాత్ర తో నవ్వులు పూయించారు. అంటే... మా వాడి జాతకం ప్రకారం బ‌ర్త్‌డే హోమం  జరిగిన 108 రోజుల వరకు బయటికి రాకూడదన్నారు, అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేటర్స్ కి వస్తున్నాడు హ్యాపీ బర్త్‌డే సుందర్, బ్లాక్ బస్టర్ ప్రాప్తిరస్తు, అని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నాని తో మలయాళీ ముద్దగుమ్మ నజ్రియా రొమాన్స్ చేస్తుంది. 

Ante Sundaraniki Barthhday Homam Unveiled:

Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Barthhday Homam Unveiled, Film Releasing On June 10th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ