Advertisementt

మార్చి 2 కి రాధే శ్యామ్ రెండో ట్రైలర్ రెడీ

Wed 23rd Feb 2022 08:50 PM
prabhas,pooja hegde,radha krishna kumar,radhe shyam second trailer,radhe shyam movie  మార్చి 2 కి రాధే శ్యామ్ రెండో ట్రైలర్ రెడీ
Radhe Shyam second trailer ready for March 2 మార్చి 2 కి రాధే శ్యామ్ రెండో ట్రైలర్ రెడీ
Advertisement
Ads by CJ

రాధే శ్యామ్ అన్ని గండాలని దాటుకుని మార్చి 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీగా నిర్మించిన రాధే శ్యామ్ మూవీ అప్ డేట్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ కాచుకుని కూర్చున్నారు. రిలీజ్ కి టైం దగ్గర పడిపోతుంది.. రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్ మీద ప్రభాస్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. అయితే యూవీ వారు మాత్రం పెద్ద సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ హంగామా ముగిస్తే.. రాధే శ్యామ్ ప్రమోషన్స్ మొదలు పెడదామనే థాట్ లో ఉన్నారో.. ఏమో.. ప్రమోషన్స్ విషయంలో కూల్ గా, సైలెంట్ గా కనిపిస్తున్నారు.

డిసెంబర్ లోనే రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటుగా పాన్ ఇండియా మార్కెట్ కి తగ్గట్టుగా ట్రైలర్ ని వదిలిన మేకర్స్.. రిలీజ్ కి ముందు మరో ట్రైలర్ ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభాస్ - పూజ హెగ్డే మెయిన్ హైలెట్ గా ఈ ట్రైలర్ కట్ ఉండబోతుంది అంటున్నారు. అది కూడా మార్చి 2న రాధే శ్యామ్ నుండి రెండో ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. మార్చి 2న రాబోయే కొత్త ట్రైలర్ పై ఈ వారంలోనే మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త ట్రైలర్ తోనే రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో రిలీజ్ వరకు రచ్చ చేస్తారని తెలుస్తుంది. 

Radhe Shyam second trailer ready for March 2:

Prabhas Radhe Shyam second trailer ready for March 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ