తెలంగాణాలో భీమ్లా నాయక్ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ దగ్గరా పవన్ ఫాన్స్ రచ్చ చేస్తూ పెద్ద ఎత్తున పండగ చేసుకుంటుంటే ఏపీలో మాత్రం, భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుంది అంటేనే పవన్ ఫాన్స్ ధర్నాలు చేసారు. ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పై విషం చిమ్ముతుంది, బెన్ ఫిట్ షోస్ లేకుండా, టికెట్ రేట్స్ పెంచడానికి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది అంటూ పవన్ ఫాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు ఆంధ్ర లో మార్నింగ్ షోస్ పడ్డాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం భీమ్లా నాయక్ థియేటర్స్ లో రిలీజ్ కాలేదు.
కారణం టిక్కెట్ రేట్ల సమస్య. మార్చి తొలివారంలో టిక్కెట్ రేట్లపై కొత్త జీవో అమల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజే విడుదలైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్ రేట్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా టికెట్ రేట్స్ అధికంగా అవసూలు చేస్తే థియేటర్స్ సీజ్ చేస్తామని రెవిన్యూ అధికారులు బెదిరించారు. దానితో ప్రభుత్వం విధించిన టికెట్ రేట్స్ తో సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదంటూ కొంతమంది థియేటర్లు యాజమన్యాలు.. భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాం అంటూ బోర్డులు పెట్టారు. మైలవరంలో భీమ్లా నాయక్ థియేటర్ దగ్గర మరికొన్ని చోట్ల ఇలాంటి బోర్డు లే దర్శనమివ్వడంతో పవన్ ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏపీ సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ భీమ్లా థియేటర్స్ దగ్గర పవన్ ఫాన్స్ నినాదాలు చేస్తున్నారు.