కలవని ప్రేమికులా - విడిపోని యాత్రికులా అంటూ అద్భుతమైన మాంటేజెస్ తో నిన్ననే వచ్చిన రాధే శ్యామ్ ఈ రాతలే సాంగ్ వీక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. టాలీవుడ్ టైటానిక్ అనిపించుకునే స్థాయిలో తెరకెక్కిన రాధే శ్యామ్ ల ప్రేమగాథను మార్చి 11 నుంచీ ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు పంపనున్నారు మేకర్స్. కాగా వండర్ఫుల్ విజువల్సుతో రానున్న రాధే శ్యామ్ రన్ టైమ్ ని 2 గంటల 20 నిముషాలుగా లాక్ చేసినట్టు తెలుస్తోంది.
అలాగే మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న రాధే శ్యామ్ ప్రమోషన్సుకి భారీగా రంగం సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ కి తగ్గట్లుగా, అన్ని ప్రాంతాల ఆడియన్సుకీ రీచ్ అయ్యేట్టుగా ఇంటర్వూస్, టాక్ షోస్, ప్రీ రిలీజ్ హంగామా ప్లాన్ చేశారట. ఇక మార్చి 11 న రాధే శ్యామ్ రిలీజ్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఉండబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక థియేటర్లలో విడుదలవుతోన్న రాధే శ్యామ్ నార్త్ ఇండియాలో సైతం 3000 కి పైగా థియేటర్స్ దక్కించుకోవడం విశేషం.
ఇక ఓవర్సీస్ లో అయితే కనీ వినీ ఎరుగని స్థాయిలో 1116 కి పైగా లొకేషన్స్ లో, 3200 కి పైగా థియేటర్స్ లో 11200 కి పైగా షోస్ తో మార్చి 10 న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రాధే శ్యామ్ ప్రీమియర్స్ స్క్రీనింగ్ జరగబోతోంది.