Advertisementt

బిగ్ బాస్ ఓపెనింగ్ కి ముందే కంటెస్టెంట్ షాక్

Sat 26th Feb 2022 04:03 PM
big boss ott,bigg boss telugu ott,roll rida,bb ott,nagarjuna,bigg boss telugu ott opening  బిగ్ బాస్ ఓపెనింగ్ కి ముందే కంటెస్టెంట్ షాక్
A contestant shock before the Bigg Boss OTT Telugu opening బిగ్ బాస్ ఓపెనింగ్ కి ముందే కంటెస్టెంట్ షాక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ వేదికగా మరికొన్ని గంటల్లో మొదలు కాబోతుంది. నాగార్జున హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు ఓటిటి ఫస్ట్ డే.. కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపే కార్యక్రమం మొదలైపోయింది. రీసెంట్ గా బిగ్ బాస్ ఓటిటి నుండి ప్రోమో కూడా వచ్చేసింది. చాలామందిని హౌస్ లోకి పంపేసినట్టుగా, బిగ్ బాస్ హౌస్ లోకి నాగ్ వెళ్ళినట్టుగా ఆ ప్రోమో ఉంది. అయితే ఈసారి హౌస్ లోకి 17 మంది వెళ్ళబోతున్నట్టుగా నాగార్జున రివీల్ చేసారు. అందులో కొన్నిపేర్లు సోషల్ మీడియాలో గట్టుగానే వినిపించాయి. కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారని అంటున్నారు. వారెవరు అనేది  ఈ రోజు ఆరు గంటల తర్వాత రివీల్ అవ్వుతోంది.

అయితే అన్నీ పూర్తయ్యి.. కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని.. హౌస్ లోకి వెళ్లబోయే ముందే ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఓటిటికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది సీజన్ 2 లో ర్యాపర్ గా అడుగుపెట్టిన రోల్ రైడా. ఓటిటి కోసం భారీ ఆఫర్ తో హౌస్ లోకి వెళ్ళడానికి ఒప్పుకుని క్వారంటైన్ లో ఉండి, రెండు రోజుల క్రితమే ఫోన్ కూడా ఇచ్చేసిన రోల్ రైడా.. బిగ్ బాస్ ఓటిటి మొదలు కావడనికి ఒక రోజు ముందే అంటే నిన్నే కాలికి సంబందించిన ఓ సమస్యతో హౌస్ లోకి వెళ్లకుండా తప్పుకున్నాడని, అందుకే 18 మంది హౌస్ లోకి వెళ్ళాల్సింది.. ఇప్పుడు 17 మందినే బిగ్ బాస్ ఓటిటికి లోకి యాజమాన్యం నాగార్జున చేతుల మీదుగా పంపుతున్నట్టుగా తెలుస్తుంది. 

A contestant shock before the Bigg Boss OTT Telugu opening:

Unexpected Shock In Big Boss OTT, Roll Rida Felt From BB OTT

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ