రాధే శ్యామ్ హిందీ వెర్షన్ కి బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధే శ్యామ్ అదర్ లాంగ్వేజెస్ కి కూడా ఆయా భాషలకి చెందిన ప్రముఖులు ప్రభాస్ కోసం గొంతు సవరించుకోబోతున్నారు. రాధే శ్యామ్ తెలుగు వెర్షన్ కి సంబంధించి రాజమౌళి తన డార్లింగ్ బాహుబలి ప్రభాస్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలిసింది. అలాగే తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో వాయిస్ ఓవర్ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హిందీలో బిగ్ బి అమితాబ్ వాయిస్ ఇచ్చారు కాబట్టి.. అదే స్ట్రేచర్ కి తగ్గట్టుగా రజినీకాంత్ కూడా తమిళ్ కి మ్యాచ్ చేస్తారు. పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ కి రజినీకాంత్ తన బ్లెస్సింగ్ ఇస్తారని ఆశిస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. ఒకవేళ సూపర్ స్టార్ ఒప్పుకుంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి అమితాబ్ ఆశీస్సులు దక్కినట్టే.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీస్సులు కూడా దక్కుతాయి. మార్చ్ 11 న రిలీజ్ కాబోయే రాధే శ్యామ్ ఓవర్సీస్ లో లెక్కకి మించిన స్క్రీన్స్ లో భారీగా రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగా రాధే శ్యామ్ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. డైరెక్టర్ రాధాకృష్ణ అన్నీ భాషల్లో మీడియాతో ఇంట్రక్ట్ అవుతున్నారు.