ఈమధ్యన టివి సీరియల్ ఆర్టిస్ట్ అయినా, వెండితెర కి పని చేసే జూనియర్ ఆర్టిస్ట్ లు అయినా.. కొద్దిగా ఫేమ్ రాగానే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చెయ్యడం తాము చేసే పనులని యూట్యూబ్ లోకి ఎక్కించడం, అంతేకాదు.. వెండితెర మీద, బుల్లితెర మీద ఫేమ్ ఉన్న నటులతో ప్రతి యూట్యూబ్ ఛానల్స్ వారు ఇంటర్వ్యూలు చేస్తూ, వ్యూస్ పెంచుకుంటూ హడావిడి చేస్తున్నారు. అటు యూట్యూబ్ ఛానల్స్ అలానే ఉన్నాయి. ఇటు ఆర్టిస్ట్ లు అలానే ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం ఇలాంటి ఇంటర్వ్యూలకి దూరం. తనని యూట్యూబ్ నిలబెట్టినా, సోషల్ మీడియా హీరోని చేసినా.. ఆ సోషల్ మీడియా ఇంటర్వ్యూకి దూరంగా ఉంటాడు.
అతనే.. షార్ట్ ఫిలిం హీరో, సోషల్ మీడియా కింగ్, బిగ్ బాస్ రన్నర్ షణ్ముఖ్ జాస్వంత్. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొలోమంటూ ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులారిటీ పెంచుకుంటే. షణ్ముఖ్ మాత్రం రన్నర్ గా గెలిచి వైజాగ్ వెళ్ళిపోయాడు కానీ.. ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కానీ లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన షణ్ముఖ్ తనకి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదు అని, ఒకవేళ ఇస్తే కెరీర్ ప్రశ్నలు అడగరు. దీప్తి సునాయానాతో ఎందుకు విడిపోయారు అంటారు. అలాగే కామెంట్స్ బాక్స్ లో మా పేరెంట్స్ ని తిట్టడం చేస్తుంటారు. నా వలన నా ఫ్యామిలీ ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు.
నువ్ ఇంటర్వ్యూ ఇవ్వని కారణంగానే అప్పట్లో నువ్వు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిన్ను చాలా ఛానల్స్ బాడ్ చేశాయట కదా అని ఆ ఛానల్ యాంకర్ అడగ్గా.. ఏమో బ్రో.. నాకైతే ఈ ఇంటర్వ్యూ లు ఇవ్వడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మా మామ్ హోమ్ టూర్ చేసారు. అది కూడా నచ్చదు. నా వలన నా ఫ్యామిలీని ఎవరు తిట్టినా నేను భరించలేను అంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు