Advertisementt

వలిమై ఓటిటి డేట్ ఫిక్స్

Sat 26th Feb 2022 09:04 PM
valimai,valimai ott release date,valimai digital rights details,ajith kumar,karthikeya  వలిమై ఓటిటి డేట్ ఫిక్స్
Valimai OTT Date Fix వలిమై ఓటిటి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వలిమై ఈ గురువారమే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ లో సూపర్ టాక్ తోనూ, తెలుగులో సో సో టాక్ తో వలిమై ఫస్ట్ డే కలెక్షన్స్ కొల్లగొట్టింది. కోలీవుడ్ లో ఈ సినిమాకి తమిళ్ తంబీలు బ్రహ్మరధం పడుతున్నారు. అజిత్ మాస్ యాక్షన్ కి, ఆయన హీరోయిజానికి ఫిదా అవుతున్నారు. కానీ తెలుగులో ఎప్పటిలాగే అజిత్ సినిమా జస్ట్ వచ్చింది వెళ్ళింది అనే రీతిలో ఉంది. సెకండ్ హాఫ్ నిడివి, కార్తికేయ విలనిజం, వినోత్ దర్శకత్వం.. ఇలా తెలుగు ప్రేక్షకులని వలిమై డిస్పాయింట్ చేసింది. అజిత్ యాక్షన్ బావున్నా.. సినిమాలో ఆ యాక్షన్ తప్ప ఇంకేమి లేదు అంటున్నారు. 

అందులోను భీమ్లా నాయక్ రాక తో వలిమై కి డ్యామేజ్ జరిగింది. కానీ తమిళ్ లో వలిమై కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. అక్కడ వలిమై కి మంచి రివ్యూస్ రావడం, సోషల్ మీడియా టాక్, అజిత్ యాక్షన్ అన్ని నచ్చడంతో.. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర గట్టిగా నిలబడింది. ఫిబ్రవరి 24 న రిలీజ్ అయిన వలిమై డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వలిమై డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ స్టూడియోస్‌ డెబ్బై కోట్లకు దక్కించుకుందని.. సినిమా విడుదలైన 30 రోజులకి అంటే మార్చి 25 న అజిత్ వలిమై జీ 5 లో స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా చెబుతున్నప్పటికీ.. మేకర్స్ నుండి స్పష్టత రావాల్సి ఉంది. 

Valimai OTT Date Fix:

Valimai OTT Release Date, Digital Rights details

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ