డీజే టిల్లు గాడు.. అంటూ సిద్దు జొన్నలగడ్డ ఫిబ్రవరి 12 న థియేటర్స్ లో డీజే వాయించి వదిలిపెట్టాడు. సితార బ్యానర్ పై తెరకెక్కిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ టాక్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా సిద్దు అండ్ డీజే టిల్లు టీం.. సక్సెస్ టూర్ అంటూ చేసిన హంగామా సినిమా కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. భీమ్లా నాయక్ వచ్చేవరకు 15 రోజుల పాటు ఏకధాటిగా కలెక్షన్స్ తెచ్చుకున్న డీజే టిల్లు గాడు ఇప్పుడు ఆహా అంటూ అందరి ఇళ్లలో డీజే వాయించడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం థియేటర్స్ లో ఇన్ కమ్ తగ్గడంతో.. డీజే టిల్లు ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది.
మార్చ్ 4 న థియేటర్స్ నుండి డీజే గాడి లొల్లి ఆహా లో స్ట్రీమింగ్ కి రాబోతుంది. మంచి డీల్ తో ఆహా ఓటిటి వారు డీజే టిల్లు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకోవడంతో.. డీజే టిల్లు మార్చ్ 4 న ఆహా ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకు రావడానికి డేట్ ఫిక్స్ చేసి.. మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన ఇచ్చేసారు. హీరోయిన్ నేహా శెట్టి తో సిద్దు జొన్నలగడ్డ లొల్లి ఇకపై అందరి ఇళ్లలో గట్టిగా వినబడబోతుంది. గెట్ రెడీ ఆహా ఆడియన్స్ .