Advertisementt

ఈ వారం బిగ్ బాస్ ఓటిటి నామినేషన్స్

Mon 28th Feb 2022 11:58 AM
bigg boss,bigg boss ott telugu,nagarjuna,nataraj master,akhil sarthak,sarayu,hamida,mumaith khan,rj chaitu,mitra sharma  ఈ వారం బిగ్ బాస్ ఓటిటి నామినేషన్స్
Bigg Boss Telugu OTT Nominations this week ఈ వారం బిగ్ బాస్ ఓటిటి నామినేషన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో ఈ శనివారమే గ్రాండ్ గా మొదలయ్యింది. నాగార్జున 17 మంది కంటెస్టెంట్స్ ని దగ్గరుండి మరీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపేశారు. ఈసారి బిగ్ బాస్ కి 10 మంది బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, మరో 7 మంది కొత్త కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారు. నటరాజ్ మాస్టర్, అరియానా, సరయు, హమీదా, ముమైత్ ఖాన్, అఖిల్, తేజు, మహేష్ విట్టా, ఆశు రెడ్డి లు ఓల్డ్ కంటెస్టెంట్స్ కాగా.. స్రవంతి, ఆర్ జె చైతు, శ్రీ రాపాక, మిత్రా శర్మ, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్ కుమార్, అనిల్ లు కొత్తగా హౌస్ లోకి వచ్చారు. 84 రోజుల పాటు అంటే.. 12 వారాలపాటు బిగ్ బాస్ ఓటిటి కొనసాగనుంది. ప్రతి శనివారం నాగార్జున.. హౌస్ మేట్స్ కి క్లాస్ ఇచ్చినా, ఎలిమినేట్ చేసినా.. ఫన్ అందించినా.. ఆ ఒక్కరోజే. ఆదివారం నాగ్ రారు.

ఇక ఈ వారం నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి. హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం అవుతున్నా బిగ్ బాస్ లో గత రాత్రి నామినేషన్స్ లో ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ ని ఎక్కువగా నామినేట్ చేసారు. ఆయన యాటిట్యూడ్ నచ్చేలేదనే కారణంతో. ఇంకా అరియానా, సరయు, హమీదా, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతూ ఈ వారం ఫస్ట్ ఎలిమినేషన్ కోసం నామినేషన్‌లోకి వచ్చిన వారిలో ఉన్నారు. అఖిల్ సార్థక్, నటరాజ్ లు తమని నామినేట్ చేసిన వారితో వాదం పెట్టుకున్నారు. సరయు, హమీదాలు మాత్రం తమని నామినేట్ చేసిన వారితో ఉన్న ప్రోబ్లెంస్ ని సాటౌట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసారు. మరి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు బిగ్ బాస్ అందుబాటులో ఉన్నా.. స్టార్ మాలో ఓ గంట వేస్తే బావుంటుంది అని బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 

Bigg Boss Telugu OTT Nominations this week:

Bigg Boss OTT Telugu Nominations list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ