మెగాస్టార్ ఫ్యాన్సుకి భోళా శంకర్ ఫస్ట్ లుక్ రూపంలో, రెబల్ స్టార్ ఫ్యాన్సుకి ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రకటనతో ఫెస్టివల్ గిఫ్ట్స్ అందాయి. ఇప్పుడిక సూపర్ స్టార్ వంతు వచ్చింది. అభిమాన ప్రేక్షకులకు మహా శివరాత్రి కానుకగా తన తాజా చిత్రం సర్కారు వారి పాట పోస్టర్ ను ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేసారు మహేష్ బాబు.
వాలంటైన్స్ డే సందర్భంగా కళావతి సాంగ్ తో క్లాస్ ట్రీట్ ఇచ్చిన మహేశుడు శివరాత్రికి మాత్రం సర్కారు వారి సినిమాలో తాను ఆడనున్న శివ తాండవాన్ని మనకు పరిచయం చేస్తూ మాంచి మాస్ పంచ్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రంలోని మహేష్ క్యారెక్టరైజేషన్ తెలిసినవాళ్లంతా పోకిరి + దూకుడు = సర్కారు వారి పాట అవుతుందంటూ సోషల్ మీడియాలో హైప్ పెంచేస్తూ ఉండగా... ఇప్పుడీ పోస్టర్ తో ఆ ఎక్సపెక్టేషన్స్ ఎక్స్ ట్రీమ్ లెవెల్ కి చేరుకునేలా చేసారు మహేష్.
స్టైలిష్ యాక్షన్ సీన్స్ లో సూపర్ స్టార్ ఎలా చెలరేగిపోతాడో తెలిసిందే కనుక ఈ స్టిల్లు చూడగానే ఒళ్ళు ఝల్లుమంటోంది అభిమానులకి. ఇక ఆ సినిమాకి సంబంధించి రానున్న ప్రతి అప్ డేట్ కీ ఇలాగే అంచనాలు పెంచుకుంటూ ఎపుడెపుడా అని సర్కారు వారి పాట విడుదలయ్యే మే 12 కోసం వేచి చూస్తూ ఉంటారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్.!