Advertisementt

బిగ్ బాస్ ఓటిటి: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే

Thu 03rd Mar 2022 08:53 PM
bigg boss,bigg boss ott telugu,rj chaitu,mitraaw sharma,sarayu  బిగ్ బాస్ ఓటిటి: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే
Bigg Boss Telugu OTT Danger Zone Contestants! బిగ్ బాస్ ఓటిటి: డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరంటే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన రెండు నెలలకే బిగ్ బాస్ ఓటిటి మొదలయ్యింది. ఎప్పుడూ ఓ గంట ఫుటేజ్ మాత్రమే చూసే బిగ్ బాస్ ప్రేక్షకులకి.. ఈసారి 24 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేసి హాట్ స్టార్ ఓటిటి తో కలిసి బిగ్ బాస్ మొదలు పెట్టారు. బిగ్ బాస్ ఓటిటి మొదలై అప్పుడే ఐదు రోజులు గడిచాయి. ఈ శనివారంతో ఓ వారం పూర్తవుతుంది. అయితే బిగ్ బాస్ మొదలు పెట్టిన వారంలోనే ఎవరో ఓ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. ఈ వారం  నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్, హమీదా, అరియానా, మిత్రా శర్మ, ఆర్జే చైతులు నామినేట్ అయ్యారు. ఎవరికి వారే బిగ్ బాస్ లో తెగ గొడవలు పడిపోతూ తమని తాము ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నారు.

యాంకర్ శివ తో నటరాజ్ మాస్టర్ ఫైట్, అఖిల్ తో శివ ఫైట్, వారియర్స్ - చాలెంజర్స్ మధ్యన టాస్క్ ల గోలతో కేవలం ఐదు రోజులకే బిగ్ బాస్ పై అందరిలో ఆశక్తిని రేకెత్తించారు. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే టాస్క్ ల విషయంలో తెగ పోటీ పడుతున్నారు. ఈ వారం బయటికి వెళ్లేందుకు ఎవరూ రెడీ గా లేరు. నామినేషన్స్ అప్పుడే చాలా హీట్ ఎక్కిన హౌస్ ఈసారి ఫస్ట్ ఎలిమినేషన్ ఎలా ఉండబోతుందో, అటు హౌస్ మేట్స్ కి ఇటు ప్రేక్షకులకి మొదలయ్యింది. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం హమీద, అరియానా, ముమైత్ ఖాన్,నటరాజ్ మాస్టర్ లు సేఫ్ జోన్‌లో ఉండగా.. సరయు, ఆర్జే చైతు, మిత్రా డేంజర్ జోన్‌లో ఉన్నారు. వారిలో సరయూకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువ. ఫైనల్ గా ఆర్జే చైతు, మిత్ర శర్మలలో ఎవరో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వీడేలా ఉన్నారు. 

Bigg Boss Telugu OTT Danger Zone Contestants! :

Bigg Boss OTT Telugu: Whoever is in the Danger Zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ