Advertisementt

బిగ్ బాస్ ఓటిటి ఫస్ట్ కెప్టెన్

Fri 04th Mar 2022 06:08 PM
bigg boss,bigg boss nonstop,bigg boss 1st week captain,tejaswi,akhil ashu reddy,ariyana,akhil sarthak  బిగ్ బాస్ ఓటిటి ఫస్ట్ కెప్టెన్
Meet The First Captain Of Bigg Boss Telugu OTT బిగ్ బాస్ ఓటిటి ఫస్ట్ కెప్టెన్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి ఫస్ట్ సీజన్ హాట్ స్టార్ లో మొదలై ఈ రోజుకి ఓ వారం పూర్తయ్యింది. గత శనివారం నాగార్జున హోస్ట్ గా 17 మంది కంటెస్టెంట్స్ ఓటిటి లోకి అడుగుపెట్టారు. అందులో 9 మంది ఓల్డ్, 8 మంది కొత్త కంటెస్టెంట్స్ ఉన్నారు. పాతవారు వారియర్స్, కొత్త వారు చాలెంజర్స్ గా డివైడ్ చేసి టాస్క్ లు ఇస్తూ బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇక టాస్క్ లు, నామినేషన్స్ విషయంలో కొత్త, పాత వాళ్ల మధ్యన ఓ యుద్ధమే జరుగుతుంది. నామినేషన్స్ విషయంలో నటరాజ్ మాస్టర్ కి చాలెంజర్స్ కి మధ్యన గొడవ గట్టిగా జరిగింది. 

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా రసాభాసగా సాగింది. కెప్టెన్సీ టాస్క్ ల్లో తేజు, అఖిల్, ఆశు రెడ్డి లు గట్టిగా పోటీలు పడగా.. ఆశు కి ఫైనల్స్ కి వెళ్ళడానికి రెండు ఓట్స్ రావడంతో ఆమె నానా రచ్చ చేస్తూ ఏడ్చేసింది. ఇక కెప్టెన్ అవ్వడానికి చివరి టాస్క్ లో అరియనా, తేజు, అఖిల్, సరయులు స్విమ్మింగ్ పూల్ లో పోటీ పడగా.. అందులోని అండర్ వాటర్ లో కీ తీసి తేజు ఎక్కువ బాక్స్ లు తెరవడంతో ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్ గా తేజు  అవతరించింది. అంటే బిగ్ బాస్ ఓటిటి ఫస్ట్ కెప్టెన్ గా తేజు గెలవగానే మిత్ర శర్మ ఆమెకి కెప్టెన్సీ స్టార్ ఇచ్చింది. తర్వాత బిగ్ బాస్ తేజు కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.  

Meet The First Captain Of Bigg Boss Telugu OTT:

Bigg Boss nonstop 1st week captain confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ