Advertisementt

బిగ్ బాస్ ఓటిటి: ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే

Sun 06th Mar 2022 11:38 AM
mumaith khan,bigg boss non stop,bigg boss telugu ott,big boss ott,nagarjuna  బిగ్ బాస్ ఓటిటి: ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే
Mumaith Khan Evicted From Bigg Boss Non Stop House? బిగ్ బాస్ ఓటిటి: ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. సన్నీ విన్నర్ గాను, షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ గా బయటికి వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 5 షణ్ముఖ్ - సిరి ల ఫ్రెండ్ షిప్ హద్దులు మీరి బాగా పాపులర్ అయ్యింది. ఇక సీజన్ 5 ముగియగానే.. బిగ్ బాస్ ఓటిటి ని రెండే రెండు నెలలో మొదలు పెట్టింది బిగ్ బాస్ యాజమాన్యం. గత శనివారం గ్రాండ్ గా హాట్ స్టార్ ఓటిటిలో బిగ్ బాస్ మొదలైంది. ఈసారి ఓ గంట కాదు.. 24 గంటల నాన్ స్టాప్ ప్రోగ్రాం తో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 17 మంది కంటెస్టెంట్స్ లో 9 మంది ఓల్డ్ కంటెస్టెంట్స్ 8 మంది కొత్తవారు ఉన్నారు.

ఛాలంజెర్స్ - వారియర్స్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో బోల్డ్ గా, భూతులతో రెచ్చిపోయి ఆడేసుకుంటున్నాడు. అదే కదా కావాల్సింది ప్రేక్షకులకి అంటూ బిగ్ బాస్ యాజమాన్యం దానిని అలానే వదిలేస్తుంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో నటరాజ్ మాస్టర్, సరయు, ముమైత్ ఖాన్, అరియానా గ్లోరి లు వారియర్స్ నుండి ఉండగా, చాలెంజర్స్ టీమ్ నుండి మిత్రా శర్మ, ఆర్జే చైతు ఉన్నారు. అయితే వీరిలో మిత్ర శర్మ ఎలిమినేట్ అవుతుంది అంటూ నిన్నటివరకు ఓట్స్ చూస్తే అర్ధమైంది. కానీ ఈ రోజుకి ఈక్వేషన్స్ మారిపోయాయి అని.. ఈ రోజు నాగార్జున బిగ్ బాస్ ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వొచ్చని అంటున్నారు.

లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ఓటిటి ఓట్స్ తారుమారవడంతో మిత్రా శర్మ స్థానంలోకి ముమైత్ రావడంతో.. ఆమె ఈ రోజు ఎలిమినేట్ అవుతుంది అంటున్నారు. ముమైత్ ఎక్కువగా సిగరెట్ తాగడం, అలాగే భూతులు మాట్లాడడం, ఇంకా చిన్న పిల్లలా ఏడవడం ఇవన్నీ ఆమెకి మైనస్ అవడంతో.. ఈ రోజు ఫస్ట్ ఎలిమినేటర్ గా ముమైత్ ఉండబోతుంది అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా నాగ్ చేతుల మీదుగా ఎవరు మొదటిగా ఓటిటి హౌస్ ని వీడతారు అనేది. 

Mumaith Khan Evicted From Bigg Boss Non Stop House?:

Bigg Boss Telugu OTT: Mumaith Khan Evicted?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ