Advertisementt

బిగ్ బాస్ ఓటిటి: సెకండ్ వీక్ నామినేషన్స్

Tue 08th Mar 2022 11:28 AM
bigg boss ott,bigg boss ott telugu,sarayu,akhil,anil,anchor shiva,sri rapaka  బిగ్ బాస్ ఓటిటి: సెకండ్ వీక్ నామినేషన్స్
Bigg Boss OTT: Second Week Nominations బిగ్ బాస్ ఓటిటి: సెకండ్ వీక్ నామినేషన్స్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ ఓటిటి మొదలయ్యింది.. అప్పుడే ఓ ఎలిమినేషన్ కూడా పూర్తయ్యింది. మొదటి వారం ఎలాంటి ఎక్సపెక్ట్టేషన్స్ లేని ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి ఎమోషనల్ అయ్యింది. అందరూ మిత్ర శర్మ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే.. అనూహ్యంగా ముమైత్ బయటికి వెళ్ళింది. ఇక ఈ వారం అంటే సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా హౌస్ ని హీటెక్కించాయి. బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో యాంకర్ శివ vs నటరాజ్ మాస్టర్ అన్నట్టుగా గొడవలు జరుగుతున్నాయి. మరోపక్క హౌస్ లో బోల్డ్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ మాటలతో ప్రేక్షకులకి పరీక్షా పెడుతున్నారు కంటెస్టెంట్స్. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ.. హౌస్ లో మాత్రం వారు మాట్లాడే మాటలు చిరాకు తెప్పిస్తున్నాయంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఫోటో మీద కత్తి పెట్టి హౌస్ మేట్ ని నామినేట్ చెయ్యాల్సి ఉంది. అందులో ఆశు మిత్ర శర్మ ని, సరయు యాంకర్ శివని, అఖిల్ శివని నామినేట్ చేశారు. తేజస్వి అనిల్ ని నామినేట్ చేసింది. హమీద మిత్ర శర్మని, నటరాజ్ యాంకర్ శివని, మహేష్ అనిల్ ని నామినేట్ చేసారు. తర్వాత చాలెంజర్స్ టీమ్ వాళ్ళు వారియర్స్ టీమ్ నుండి ఇద్దరిని నామినేట్ చెయ్యాల్సి ఉంది. రెండో వారం 17మందిలో ఏకంగా 11 మంది నామినేట్ అయ్యారు. సరయు, అఖిల్, హమీదా, అనీల్, మిత్రా, అరియానా, శివ, నటరాజ్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా.. ఇలా మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఈ 11 మందిలో ఎవరు బయటికి వెళతారో అనేది హాట్ టాపిక్ గా మారింది. 

Bigg Boss OTT: Second Week Nominations:

Bigg Boss OTT Telugu: Second Week Nominations list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ