Advertisementt

ప్రభాస్ తో పృథ్వి రాజ్?

Tue 08th Mar 2022 09:00 PM
prithviraj sukumaran,prabhas,salaar,prithviraj with prabhas,prashanth neel  ప్రభాస్ తో పృథ్వి రాజ్?
Is Prithviraj Sukumaran Working With Prabhas? ప్రభాస్ తో పృథ్వి రాజ్?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో నార్త్ హీరోలకి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. మరో రెండు రోజుల్లో రాధే శ్యామ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ప్రభాస్.. తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె, ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీలో నటిస్తున్నారు. మధ్యలో మారుతీ మూవీ ఉంది అంటున్నారు. ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత సందీప్ వంగా తో స్పిరిట్ లో నటిస్తారు. అయితే పక్కా మాస్ కమర్షియల్ మూవీ గా తెరకెక్కుతున్న సలార్ మూవీ లో ప్రభాస్ తో చాలామంది విలన్స్ తలపడతారట. అందులో ఇప్పటికే కన్నడ నుండి ఓ విలన్, తెలుగు నుండి జగపతి బాబు ఉన్నారు.

ఇప్పుడు మలయాళం నుండి హీరో పృద్వి రాజ్ ని సలార్ లో ప్రభాస్ తో పోటీ పడే మెయిన్ విలన్ రోల్ కి తీసుకున్నారని, ప్రభాస్ సలార్ మూవీలో నటించబోతున్న పృద్వి రాజ్ సుకుమారన్ అంటూ సోషల్ మీడియాలో సలార్ ని ట్రెండ్ చేస్తున్నారు ఫాన్స్. మరి ఈ రూమర్ లో నిజమెంతుందో తెలియదు కానీ.. ప్రభాస్ ఫాన్స్, ప్రశాంత్ నీల్ ఫాన్స్, పృథ్వి రాజ్ సుకుమారన్ ఫాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోయి ట్వీట్స్ చేస్తూ పృథ్వి రాజ్ సలార్ పోస్టర్స్ ని నేషనల్ వైడ్ గా సలార్ మూవీని ట్రెండ్ చేస్తున్నారు.  

Is Prithviraj Sukumaran Working With Prabhas?:

Is Prithviraj Sukumaran Working With Prabhas in Salaar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ