మార్చ్ 11 పాన్ ఇండియా మూవీ ల జోరు మొదలయ్యే రోజు, ఎన్నోసార్లు వాయిదాలు పడి అన్ని అడ్డంకులు దాటి ఎట్టకేలకు విడుదలవుతున్న బాహుబలి ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ పై అంచనాలు, ఆసక్తి ఓ రేంజ్ లో ఉన్నాయి. కాబట్టే లెక్కకు మించిన థియేటర్స్ లో రాధే శ్యామ్ రిలీజ్ అవుతుంది. అలాగే కోలీవుడ్ హీరో సూర్య ఈటి మార్చి పది నే రిలీజ్ అయ్యింది. మార్చ్ 11 ఇప్పుడు ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీగా ఉంది. అంటే ఓటిటీల హవా తగ్గి థియేటర్స్ హవా మొదలైన తర్వాత ఆ రేంజ్ లో ఓటిటి లో టాప్ సినిమాలు విడుదలవుతున్న రోజు మార్చి 11. రాధే శ్యామ్ ఐదు భాషల్లో థియేటర్స్ ఆక్యుపై చేసేస్తుంది.
ప్రపంచం మొత్తం రాధే శ్యామ్ హడావిడి. అంత సందడిలో ఓటిటి నుండి ఒక భారీ సినిమా రిలీజ్ కాబోతుంది. అది తమిళ్ నుండి స్టార్ హీరో ధనుష్ - మాళవిక మోహన్ నటించిన మారన్ మూవీ మార్చ్ 11 నే డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ కాబోతుంది. అలాగే ఫిబ్రవరి 11 న థియేటర్స్ లో విడుదలయిన రవితేజ ఖిలాడీ మూవీ కూడా మార్చ్ 11 నే డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ అవుతుంది. అటు థియేటర్స్ లో సూర్య ఈటి, ప్రభాస్ రాధే శ్యామ్, ఇటు ధనుష్ మారన్, రవి తేజ ఖిలాడీ మూవీ లు ఓటిటి నుండి రిలీజ్ అవుతున్నాయి. సో మార్చ్ 11 న ఓటిటి vs థియేటర్స్ అన్నట్టుగా బిగ్ ఫైట్ చూడబోతున్నాం..