బిగ్ బాస్ ఓటిటి ఇప్పుడు 24 గంటల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ హాట్ స్టార్ లో బిగ్ బాస్ యాజమాన్యం మొదలు పెట్టినా.. 24 గంటల ప్రోగ్రాంకి అంతగా ఆదరణ దక్కలేదు. దానితో ప్రతి రోజు రాత్రి 9 గంటలకు హాట్ స్టార్ లోనే ఓ ఎడిటింగ్ ఎపిసోడ్ ని ప్రసారం చేస్తుంది. ఆ ఎపిసోడ్ లో ఆ రోజు మొత్తం జరిగిన గొడవలు, కామెడీ, ప్యాచప్ లని ఎడిట్ చేసి ఓ గంట ప్రోగ్రాం ని చూపిస్తున్నారు. అయితే గత రాత్రి ఎపిసోడ్ లో చాలెంజర్స్ టీమ్ వారియర్స్ టీం మధ్యన జరిగిన ఓ టాస్క్ లో వారియర్స్ గెలవగా.. నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ బుక్ తీసుకుని ఈ టాస్క్ లో గెలిచిన వారు బెడ్ రూమ్ యాక్సెస్ అయినా, లేదంటే లగేజ్ యాక్సెస్ అయినా తీసుకోవచ్చనగానే వారియర్స్ టీం మొత్తం లగేజ్ యాక్సెస్ కావాలి అంటూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.
అయితే ఆ తర్వాత నటరాజ్ చదివిన బుక్ తీసుకుని ఛాలెంజెర్స టీమ్ వారు ఆ బెడ్ రూమ్ యాక్సెస్ అయినా, లగేజ్ యాక్సెస్ అయినా చాలెంజర్స్ ఇస్తేనే వారియర్స్ టీమ్ వాళ్ళు తీసుకోవాలని రాసి ఉంది. ఆ బుక్ తీసుకుని వారంతా వారియర్స్ టీమ్ అయిన నటరాజ్, తేజస్వి, అఖిల్ దగ్గరికి రాగా.. మేము ఇస్తేనే బెడ్ రూమ్ యాక్సెస్ అయినా, లగేజ్ యాక్సెస్ అయినా మీరు తీసుకోవాలని చెప్పగా.. సరే నేను పొరపాటుగా చదివాను అంటూ మాస్టర్ అన్నాడు. తర్వాత నటరాజ్ వంట చేసుకుంటూ బిందు మాధవి వాళ్ళు అటు వైపుగా వెళుతున్నప్పుడు అందం గా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి అంటూ కామెంట్ చేసాడు.
దానితో బిందు మాధవి వెనక్కి వచ్చి మీరు మేము లేనప్పుడు మా వెనుక మాట్లాడవద్దు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి అంటూ గొడవకి దిగింది. బిందు మాధవి vs నటరాజ్ మాస్టర్ అన్నట్టుగా ఆ గొడవ సాగింది. తర్వాత కూడా నటరాజ్ ఎక్కడా తగ్గలేదు. మళ్ళీ మీరంతా గుంపుగా వచ్చి చెబితే ఇక్కడేం వరగదు అంటూ గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు.