Advertisementt

మార్చ్ 14 నుండి అసలు సిసలైన RRR జాతర

Thu 10th Mar 2022 06:25 PM
rrr,rrr celebration anthem,ram charan,ntr,rajamouli,alia bhatt,rrr review  మార్చ్ 14 నుండి అసలు సిసలైన RRR జాతర
RRR Celebration Anthem from మార్చ్ 14 నుండి అసలు సిసలైన RRR జాతర
Advertisement
Ads by CJ

భీమ్లా నాయక్ హంగామా ముగిసింది, రాధే శ్యామ్ హడావిడి మొదలైంది, ఆర్.ఆర్.ఆర్ జాతర మొదలవ్వబోతుంది. మార్చ్ 25 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ అప్ డేట్ కోసం ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి కూడా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ఆచి తూచి మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటినుండే ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ అంటే.. అది రాధే శ్యామ్ రిలీజ్ హడావిడి లో కొట్టుకుపోతుంది అని తెలుసు. అందుకే మంచి ప్లానింగ్ తో ప్రమోషన్స్ షురూ చేసారు.

మార్చ్ 14 నుండి అసలు సిసలైన మాస్, మహా జాతర మొదలవ్వబోతున్నట్లుగా ఆర్.ఆర్.ఆర్ సెలెబ్రేషన్స్ ఆంథెమ్ అంటూ ఓ బ్యూటిఫుల్ పోస్టర్ తో అప్ డేట్ ఇచ్చింది ఆర్.ఆర్.ఆర్ టీం. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు పంచె కట్టులో ఉండగా.. హీరోయిన్ అలియా భట్ లంగావోణీ తో ట్రెడిషనల్ గా అందంగా కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్ చాలు.. ప్రమోషన్స్ కలర్ ఫుల్ గా మొదలు పెట్టబోతున్నారని తెలియడానికి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ లతో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ మోత మోగించడానికి రాజమౌళి రెడీ. మరి సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ ట్రెండ్ చెయ్యడానికి ఫాన్స్ మీరూ రెడీనా..

RRR Celebration Anthem from :

RRR Celebration Anthem from March 14th!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ