గత కొన్నిరోజులుగా సమంత పూర్తిగా మారిపోయింది. మొత్తం గ్లామర్ మీదే నడుస్తుంది. బయటికి వెళితే గ్లామర్ డ్రెస్ లోనే వెళుతుంది. మాట్లాడినా గ్లామర్ పలుకులే పలుకుతుంది. చేతి నిండా సినిమాలు, వరస ఆఫర్స్ ఉన్నా.. గ్లామర్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. పుష్ప సినిమాలో రశ్మికని పక్కకి నెట్టి ఊ అంటావా మావా.. ఉ ఊఁ అంటావా మావా సాంగ్ తో సమంత విపరీతంగా హైలెట్ అయ్యింది. రీసెంట్ గా సమంత క్రిటిక్స్ చాయిస్ అవార్డు కార్యక్రమంలో పాల్గొంది అది కూడా చాలా హాట్ గా. గ్లామర్ అనడం కన్నా సమంత విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేస్తూ ఆ అవార్డు ఫంక్షన్స్ కి వెళ్ళింది. బాలీవుడ్ భామలకే షాక్ ఇచ్చేలా సమంత డ్రెస్సింగ్ స్టయిల్ ఉంది.
అయితే ఆ ఫంక్షన్ కి వెళ్లిన సమంత మీడియా తో మట్లాడుతూ ఆడియన్స్ నా మీద కురిపించిన ప్రేమను మాటల్లో చెప్పలేను. పుష్ప సినిమాలోని. ఊ అంటావా అనే పాట ఇలా పాన్ ఇండియాగా హిట్ అవుతుందని ఊహించలేదు. ఆ సాంగ్ చూసాక ఆడియన్స్ నేను చేసిన సినిమాల్ని మర్చిపోయారు. నన్ను ఊ అంటావా మావా ఉ ఊఁ అంటావా సాంగ్ తోనే గుర్తిస్తున్నారు అంటూ చెప్పడం చూస్తే సమంత గ్లామర్ షో ని వేరే లెవల్ కి తీసుకెళ్ళబోతున్నట్టుగా హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే చేతిలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయి. అలాగే హాలీ వుడ్ ప్రాజెక్ట్ తో పాటుగా కొత్తగా విజయ్ దేవరకొండ సరసన సమంత ఛాన్స్ పట్టేసినట్లుగా న్యూస్ కూడా ఉంది.