ఈమధ్యన ఈటివి లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన చాలామంది కమెడియన్స్ స్టార్ మా కి వెళ్ళిపోయి అందులో కామెడీ స్టార్స్ అంటూ కామెడీ ప్రోగ్రాం లో హల్ చల్ చేస్తున్నారు. అదిరే అభి, అవినాష్, అప్పారావు ఇలా చాలామంది వెళ్ళిపోయినా.. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల కామెడీ తో నడుస్తుంది. అయితే ఢీ షో నుండి తప్పుకుని కేవలం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కి పరిమితమైన సుడిగాలి సుధీర్ తో పాటుగా, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ ఇద్దరూ ఇప్పుడు ఛానల్ మార్చేశారు. సుధీర్ - రష్మీ మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ తొమ్మిదేళ్లు మాయ చేసిన ఈ జంట ఇప్పుడు స్టార్ మా లో తేలింది.
స్టార్ మాలో హోలీ సందర్భంగా ప్రసారం కాబోతున్న హోలీ స్పెషల్ ప్రోగ్రాం తగ్గేదేలే ఈవెంట్ లో యాంకర్ రవి తో పాటుగా రష్మీ కూడా యాంకరింగ్ చెయ్యగా.. సుడిగాలి సుధీర్ కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రోమో యూట్యూబ్ లో హడావిడి చేస్తుంది. ఎప్పటిలాగే సుధీర్ అండ్ రష్మీ లు ఇక్కడ స్టార్ మా వేదిక మీద కూడా తమ ప్రేమని చూపించారు. నీకు.. నీ ఫ్యూచర్ కి ఎప్పుడూ దిష్టి తగలకూడదు.. అంటూ రష్మీ దిష్టి తీసింది. అయితే వీరిద్దరూ ఇప్పుడు స్టార్ లోకి వచ్చారు అంటే జబర్దస్త్ ని వీడతారా? రష్మీ ని టాప్ ప్లేస్ లో ఉంచిన ఎక్స్ట్రా జబర్దస్త్ ని వదిలేస్తుందా? సుధీర్ ని హీరో ని చేసిన జబర్దస్త్ ని సుధీర్ వదిలేస్తాడా? అనేది ఇప్పుడు వాళ్ళ ఫాన్స్ కే అర్ధం కావడం లేదు.