Advertisementt

సుధీర్ పెళ్లి అంతా ట్రాష్

Sat 12th Mar 2022 09:03 PM
sudigali sudheer,sudheer,sridevi drama company,etv,star maa,anchor rashmi  సుధీర్ పెళ్లి అంతా ట్రాష్
Sudigali Sudheer wedding is all trash సుధీర్ పెళ్లి అంతా ట్రాష్
Advertisement
Ads by CJ

సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. అది కూడా ఓ అందమైన అమ్మాయిని.. ఇది ఓ వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారం. సుధీర్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కొన్ని ఫొటోస్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి బట్టల్లో సుధీర్, ఆ అమ్మాయి ఉంది. సుధీర్ ని పెళ్లి చేసుకుంటున్న ఆ అమ్మాయి బ్యాగ్ రౌండ్ మీద కూడా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్ పెళ్లి ట్రాష్ అని తేలిపోయింది. గతంలో ఈటివి ఫెస్టివ్ ప్రోగ్రాంలో యాంకర్ రష్మిని పెళ్లి చేసుకున్నట్టుగానే.. సుధీర్ ఓ ప్రోగ్రాం కోసం వేరే అమ్మాయితో పెళ్లి పీటలెక్కాడు.

అది కూడా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం. సుధీర్ గాడి పెళ్లి, ఫస్ట్ నైట్ అంటూ ఆ ప్రోగ్రాం లో సుధీర్ ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా చూపించిన ప్రోమో ఈటివి వారు వదలడంతో సుధీర్ ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే విషయం బయటికి వచ్చింది. లేదంటే అందమైన అమ్మాయితో సుధీర్ పెళ్లంటూ కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన న్యూస్ చూసి అందరూ నిజమనుకునేవారు. ఈటివి వదిలిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో తో సుధీర్ పెళ్లి అంతా ట్రాష్ అని తేలిపోయింది. 

Sudigali Sudheer wedding is all trash:

Sridevi Drama Company Latest Promo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ