Advertisementt

రాధే శ్యామ్ ఎఫెక్ట్: ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

Sun 13th Mar 2022 12:13 PM
radhe shyam,prabhas fan,prabhas,ravi teja commits suicide,prabhas fan ravi teja  రాధే శ్యామ్ ఎఫెక్ట్: ప్రభాస్ అభిమాని ఆత్మహత్య
Prabhas fan commits suicide రాధే శ్యామ్ ఎఫెక్ట్: ప్రభాస్ అభిమాని ఆత్మహత్య
Advertisement
Ads by CJ

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తర్వాత సాహో తో ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయారు. అయినా ఆ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అవడం వలన అంతో ఇంతో నిర్మాతలు బయట పడ్డారు. కానీ రాధే శ్యామ్ విషయానికి వచ్చేసరికి ప్రభాస్ పూర్తిగా ఢీలా పెట్టేశారు. రాధే శ్యామ్ రిలీజ్ వరకు ఉన్న అంచనాలు ఎగిరిపోయాయి. ఆ సినిమా కొచ్చిన టాక్ చూస్తే అసలు ఇది ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడురా బాబు అనేలా ఉంది. ఫాన్స్ కే నచ్చలేదు అంటే ఆ సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రభాస్ సినిమా బాలేదన్న కారణంగా అది తట్టుకోలేని ప్రభాస్ అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

ప్రభాస్ కి వీరాభిమాని అయిన కర్నూలు తిలక్‌నగర్‌ కి చెందిన ముత్యాల రవి తేజ అన్న వ్యక్తి  తన అభిమాన హీరో నటించిన రాధే శ్యామ్ ప్లాప్ అవడంతో ఆత్మహత్య చేసుకున్నాడట. రవి తేజ వెల్డింగ్ పని చేసుకుంటూ ఉండేవాడని, అతనికి తండ్రి లేడని, తల్లితో కలిసి ఉండే రవి తేజ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ ని స్నేహితులతో కలిసి చూసి ఇంటికి వచ్చి సినిమా బావుండలేదని తల్లితో చెప్పి బాధపడ్డాడని అంటున్నారు. ఆ తర్వాత అదే బాధతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని రవి తేజ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీస్ లు చెబుతున్నారు.

Prabhas fan commits suicide:

Radhe Shyam Effect: Prabhas fan commits suicide

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ