యాంకర్ అనసూయ పవర్ ఫుల్ రోల్స్ తో బిగ్ స్క్రీన్ మీద కూడా పెరఫార్మెన్స్ తో ఇరగదీస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్న అనసూయ కి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ అవకాశం వచ్చింది అనే విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న మలయాళ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో అనసూయ ఓ కేరెక్టర్ చేస్తుంది అని, ఆమె కేరెక్టర్ చిరు ని మోసం చేసి జైలు కి పంపించే కేరెక్టర్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరు సేవ కార్యక్రమంలో భాగంగా ఓ అమ్మాయిని ఆమె బిడ్డని చేరదియ్యగా.. మెగాస్టార్ చిరు స్నేహితుడు చిరు ని మోసం చేసే క్రమంలోనే అనసూయ తన బిడ్డకి తండ్రి మెగాస్టార్ అని కోర్టులో అబద్దం చెప్పడంతో ఆయన జైలు పాలవుతారని అంటున్నారు.
మెగాస్టార్ ని మోసం చేసే కేరెక్టర్ లో యాంకర్ అనసూయ కనిపించనుంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో చిరు కి సిస్టర్ గా నయనతార నటిస్తుంటే.. చిరు కి బాడీ గార్డ్ కేరెక్టర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న నయన్ భర్త కేరెక్టర్ లో హీరో సత్య దేవ్ నటిస్తున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ షూటింగ్ మొత్తం సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యింది అని, చిరు - సల్మాన్ ఖాన్ కాంబో సీన్స్ ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.