Advertisementt

ప్రభాస్ ఎలా ఉన్నా ఆ డైరెక్టర్స్ ని నమ్మాల్సిందే

Tue 15th Mar 2022 10:30 AM
prabhas,prabhas fans,prabhas looks,radhe shyam,saaho movie,adipurush,project k,spirit,salaar  ప్రభాస్ ఎలా ఉన్నా ఆ డైరెక్టర్స్ ని నమ్మాల్సిందే
Fans Tension about Prabhas Physique ప్రభాస్ ఎలా ఉన్నా ఆ డైరెక్టర్స్ ని నమ్మాల్సిందే
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత రెండు సినిమాల నుండి లుక్స్ విషయంలో, ఫిజిక్ విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. ప్రభాస్ ఫిట్ నెస్ పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వరస సినిమాలు ఒప్పేసుకోవడం కాదు.. ముందు వర్కౌట్స్ మీద దృష్టి పెట్టమంటూ ప్రభాస్ ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సాహో నుండి రాధే శ్యామ్ వరకు ప్రభాస్ ఫాన్స్ కి ప్రభాస్ లుక్స్ విషయంలో బోలెడన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.  అయితే ప్రభాస్ ప్రత్యేకంగా విదేశాలకు వెళ్లి బరువు తగ్గుతున్నారు, లుక్ చేంజ్ చేస్తున్నారు అంటూ ఏవేవో టాక్స్ వినిపించినా.. ప్రభాస్ లో ఎలాంటి మార్పు లేదు. కానీ రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఆయనకే తెలుస్తుంది.

ఇక ప్రభాస్ విషయంలో ఎంత టెంక్షన్ ఉన్నా.. ఇప్పుడు ఆయన ఫాన్స్ కి ఆయన చేస్తున్న డైరెక్టర్స్ విషయంలో మాత్రం చాలా నమ్మకం ఉంది. సాహో కి, రాధే శ్యామ్ కి పని చేసిన డైరెక్టర్స్ కేవలం ఒక సినిమా అనుభవం ఉన్నవారు. కానీ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న దర్శకులు ప్రతిభావంతులు, టాప్ డైరెక్టర్స్, హిట్ ఉన్న డైరెక్టర్స్ కావడంతో ఫాన్స్ కాస్త కూల్ అవుతున్నారు. మహానటి నాగ్ అశ్విన్, కెజిఎఫ్ ప్రశాంత్ నీల్, తానాజీ ఓం రౌత్, కబీర్ సింగ్ సందీప్ వంగా విషయంలో ఫాన్స్ నిశ్చింతగా ఉన్నప్పటికీ.. ప్రభాస్ మళ్ళి మారుతీ విషయంలో రాంగ్ స్టెప్ వేశారు.. అంటూ ఆయన ఫాన్స్ కొద్దిగా ఆగ్రహంగాను, టెంక్షన్ గాను ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. మళ్ళీ మారుతీ లాంటి దర్శకులకి మాటివ్వడం ఏమిటి ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ని నిలదీస్తున్నారు.

ఇక కెజిఎఫ్ తో హీరో ఎలివేషన్ ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ చూపించారు. సో ప్రభాస్ ఎలా ఉన్నా.. మాస్ యాంగిల్ లో ప్రెజెంట్ చేస్తారు కాబట్టి కూల్. ఇక నాగ్ అశ్విన్ ఏదొక మ్యాజిక్ అయితే చేస్తారు. ఆదిపురుష్ లో మోడ్రెన్ రామ గా ప్రభాస్ ఆహార్యం సూపర్ గా ఉంటుంది.. సో ఈ డైరెక్టర్స్ ప్రభాస్ ని ఏదో ఓ మాయ చెయ్యగలరు అని ఫాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. 

Fans Tension about Prabhas Physique:

Fans Tension about Prabhas looks

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ