ఈరోజు మంగళవారం ఆర్.ఆర్.ఆర్ హీరోలు తారక్, చరణ్, దర్శకుడు రాజమౌళి మీడియా మీట్ నిర్వహించారు. ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోయిన ఆర్.ఆర్.ఆర్ గురించి మళ్లీ RRR (రాజమౌళి- రామ రావు-రామ్ చరణ్) లు ఏం చెబుతారా అనే ఆత్రుత అందరిలో కనిపించింది. ఏప్పటిలాగే తారక్ - రామ్ చరణ్ లు స్టైలిష్ గా ఈ ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. ఇక్కడ స్పీచ్ లు ఇవ్వడం ఉండదు.. కేవలం క్వచ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే అంటూ రాజమౌళి ముందే మీడియా మిత్రులకి ఇన్ స్ట్రకషన్స్ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మీడియా జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తిగా, ఇంట్రెస్టింగ్ గా సమాధానాలు ఇచ్చారు.
అయితే ప్రెస్ మీట్ లో ఇకపై ఇలాంటి మల్టి స్టారర్స్ ని ఆడియన్స్ చూడబోతున్నారా అన్న ప్రశ్నకు తారక్.. ఇకపై ఇలాంటి మల్టీస్టారర్స్ తరుచూ వస్తాయి. మహేష్ తో మల్టీస్టారర్ చేయాలి, ప్రభాస్ తో చెయ్యాలి, చిరంజీవి గారితో, బాల బాబాయ్ తో, వెంకటేష్ గారితో మల్టీస్టార్స్ చెయ్యాలి.. అందరితో ఓ మూవీ చెయ్యాలి అంటూ ఫన్ చేసారు.
మరి ఎన్టీఆర్ ఆన్సర్ చూస్తే ఎన్టీఆర్ కి మల్టీస్టారర్ డ్రీమ్స్ చాలానే ఉన్నాయనిపించినా.. ఎన్టీఆర్ ఆన్సర్ తో ఆయన ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ ని మహేష్ - ప్రభాస్ అలాగే ముఖ్యంగా బాలకృష్ణ సినిమాలోనూ చూడాలని ఉంది అంటూ అప్పుడే డ్రీమ్స్ వేసుకుంటున్నారు ఫాన్స్. నిజంగా ఎన్టీఆర్ చెప్పిందే నిజమైతే.. మల్టీస్టారర్స్ లో మరో శకం మొదలైనట్టే.