ఆంధ్రా ప్రభుత్వానికి కి సినిమా ఇండస్ట్రీ కి ఎడతెగని సంబంధం లాగా.. వారానికో సినిమా ప్రముఖుడు వెళ్లి ఏపీ సీఎం జగన్ ని మీటవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం ఏకతాటిపై అంటూ చిరు, ప్రభాస్, మహేష్, రాజమౌళి వెళ్లొచ్చి ఐదో ఆటకి అనుమతి, టికెట్ రేట్ పెంపు జీవో లపై మాట్లాడి వచ్చారు. తర్వాత ఎవరికి వారే సీఎం జగన్ ని కలిసి వస్తున్నారు. మా ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు వెళ్లి జగన్ ని మీట్ అయ్యారు. తర్వాత రాధే శ్యామ్ నిర్మాతలు వెళ్లారు. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య, రాజమౌళి వెళ్లి జగన్ ని మీటయ్యారు. అయితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో కొంతమంది మీడియా వారు ఆంధ్రలో ఆర్.ఆర్.ఆర్ బెన్ఫిట్ షోస్ విషయం లేవనెత్తారు.
దానికి రాజమౌళి నిన్న సీఎం జగన్ గారు బాగా రిసీవ్ చేసుకున్నారని, పెద్ద సినిమా ఆర్.ఆర్.ఆర్ కి నష్టం కలగకుండా చూస్తామని మాటిచ్చారని.. బెన్ఫిట్ షో అంటే.. అక్కడ ఐదో ఆటకి అనుమతి ఉంది. ఒక్కరోజే కాదు.. రోజూ బెన్ఫిట్ షోస్ ఉంటాయంటూ మట్లాడారు. రాజమౌళికి జగన్ పెట్టిన మెలిక అర్ధం కాలేదనా దానర్ధం. అంటే ఐదో ఆటకి అనుమతి ఇచ్చింది.. కేవలం ఆ ఐదో ఆటలో చిన్న సినిమా ప్రదర్శించడానికే కానీ.. పెద్ద సినిమాకు ఐదు ఆటలకి అనుమతులు ఇవ్వలేదు అనేది. భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వవు. ఒకవేళ అయినా థియేటర్స్ దొరకని కారణంగా సైలెంట్ గా ఉంటారు. కానీ ఏపీలో నాలుగు ఆటలు ఒక పెద్ద సినిమా, ఐదో ఆట చిన్న సినిమా అన్నట్టుగా జీవో ఇచ్చారు. ఇప్పుడు రాజమౌళి కి ఆ ఐదో ఆట కూడా ఆర్.ఆర్.ఆర్ షో వేసుకొమ్మని ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న.
మరి తెలంగాణాలో రాధే శ్యామ్ బెన్ఫిట్ షో అంటూ తెల్లవారి ఝామునే.. 3.30 కె షో వేసేసారు. మరి అలానే తెలంగాణలోని హైదరాబాద్ లో ఆర్.ఆర్.ఆర్ బెన్ఫిట్ షో కూడా ఉంటుందేమో అని చరణ్ మరియు తారక్ ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయం మరో రెండు రోజుల్లో క్లారిటీ అయితే రావోచ్చు.