Advertisementt

జబర్దస్త్ లో తొడ కొట్టిన రోజా - ఆమని కామెడీ

Wed 16th Mar 2022 03:38 PM
extra jabardasth,jabardasth latest promo,roja,amani,sudheer,sudigali sudheer,ram prasad,roja - amani special skit  జబర్దస్త్ లో తొడ కొట్టిన రోజా - ఆమని కామెడీ
Sudigaali Sudheer, Rashmi, Roja special skit in Jabardasth జబర్దస్త్ లో తొడ కొట్టిన రోజా - ఆమని కామెడీ
Advertisement
Ads by CJ

కామెడీ షోస్ కి రారాజు జబర్దస్త్ కి ఇప్పుడు కమెడియన్స్ కరువయ్యారు. ఒకప్పుడు టాప్ కమెడియన్స్ తో కళకళలాడిన జబర్దస్త్ లో ఇప్పుడు ఆ కమెడియన్స్ కనిపించడం లేదు. చాలామంది వేరే ఛానల్స్ లోకి జంప్ అయ్యారు. ఆఖరికి సుధీర్ కూడా రష్మీ తో కలిసి ఈటివి నుండి స్టార్ మా ప్రోగ్రామ్స్ కోసం వెళుతున్నాడు. అయితే జబర్దస్త్ లోనే కామెడీ స్కిట్స్ చేసుకుంటున్నాడు సుధీర్. ఇక జబర్దస్త్ స్టేజ్ పై నాలుగైదు స్కిట్స్ పడాల్సింది.. ఇప్పుడు ఒకటి రెండు స్కిట్స్, మధ్యలో సీరియల్ ఆర్టిస్ట్ ల హడావిడి, డాన్సర్స్ హంగామా కనిపిస్తుంది తప్ప.. ప్రోపర్ స్కిట్స్ పడడం లేదు. అందుకే జబర్దస్త్ జెడ్జెస్ రోజా, మనో కూడా స్కిట్స్ లోకి వచ్చేస్తున్నారు. రీసెంట్ గా జబర్దస్త్ స్టేజ్ పై లాహే లాహే అంటూ రోజా రామ్ ప్రసాద్ తో, ఆమని సుధీర్ తో కలిసి స్పెషల్ స్కిట్ అంటూ చేసారు. 

రోజా: ఏంట్రా ఎందుకు పిలిచావ్ అంటూ రామ్ ప్రసాద్ ని అడగగా.. అక్క వాళ్ళు చూడు మనతో గొడవ పడుతున్నారనగానే.. రోజా ఎవడ్రా అది అంటూ తొడ కట్టింది. అక్కడ వాడు ఒక అడుగు వెనక్కి వేసాడు అని రామ్ ప్రసాద్ అనగానే.. హలొ పులి ఒక్క అడుగు వెనక్కి వేసింది అంటే పది అడుగులు ముందు వేస్తుంది అంటూ సుధీర్ అన్నాడు. దానికి రోజా పగలబడి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారని సుధీర్ అడిగాడు. పులి గురించి పులి రాజా చెప్పుకుంటున్నాడు అంటూ రోజా కామెడీ చేసింది. దానికి షాకయిన ఆమని ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిందట అంటూ సామెత చెప్పింది. తర్వాత రోజా రామ్ ప్రసాద్ కి కథ చెప్పింది. ఆ తర్వాత ఆమని కూడా సుధీర్ కి ఓ కథ చెప్పింది. ఎలా ఉంది కథ అని సుధీర్ ని అడిగింది. నీకు ఆవిడలా కథలు చెప్పడం రాదులే అక్కా అంటూ  చేసిన కామెడీ స్కిట్.. యూట్యూబ్ లో వైరల్ అయ్యింది.

Sudigaali Sudheer, Rashmi, Roja special skit in Jabardasth:

Extra Jabardasth Latest Promo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ